విజయనగరం

భయం... భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంట్యాడ, జనవరి 21: తాటిపూడి జలాశయం మెయిన్ గేటులో నాలుగవ నంబరు గేటు శనివారం ఉదయం 10 గంటల సమయంలో హఠాత్తుగా పైకిలేవడంతో జలాశయంలో నీరు గోస్తనీలోకి ఉద్ధృతంగా ప్రవహించింది. ఆ సమయంలో జలాశయం దిగువన కాలువలో దుస్తులు ఉతుకుతున్న ఎస్‌కోట మండలం దొరలపాలెంనకు చెందిన ఇద్దరు మహిళలలో జమ్మిలి తాడెమ్మ (34) వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. సంఘటన సమయంలో జలాశయం వద్ద నీటిపారుదలశాఖ సిబ్బంది కన్పించలేదని స్థానికులు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో సాగునీటి సిబ్బంది డ్యామ్ వద్దకు చేరుకున్నారు. గోస్తనీ నది పరివాహక ప్రాంతాలైన గంట్యాడ మండలంలోని మదుపాడ, ఎస్‌కోట మండలంలోని వేములపల్లి, గోపాలపల్లి, ముషిడిపల్లి, మామిడిపల్లి, జామి మండలంలోని కొట్టాం, తాండ్రంగి, విజినిగిరి, తానవరం, జామి, జన్నివలస, కొత్తబీమసింగి గ్రామాల ప్రజలకు ఆఘమేఘాల మీద వరద ముప్పు సమాచారం అందించి ప్రజలను అప్రమత్తం చేశారు. నీటిపారుదలశాఖ ఇఇ వెంకటరమణ, సిబ్బంది డ్యామ్ వద్దకు చేరుకొని సంఘటనకు దారితీసిన కారణాలపై ఆరా తీశారు. గజపతినగరం ఎమ్మెల్యే కెఎ నాయుడు తాటిపూడి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అలాగే ఆర్డీవో శ్రీనివాసమూర్తి, తహశీల్దార్ బాపిరాజు, ఎస్సై వాసుదేవ్ పరిస్థితిని ఎప్పటికపుడు సమీక్షించి ఉన్నతాధికారులకు నివేదించారు.
గేటు మరమ్మతు పనులు చేపట్టేందుకు యుద్ధప్రాతిపదికన ఇంజనీరింగ్ సిబ్బందిని రప్పించారు. ఇదిలా ఉండగా కలెక్టర్ వివేక్‌యాదవ్, తాటిపూడికి చేరుకొని పరిస్థితిని ఆరా తీశారు. వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన మహిళ కుటుంబీకులను పరామర్శించి ప్రమాద కారణాలను అడిగి తెలుసుకున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన తమను ఆదుకోవాలని బాధిత కుటుంబీకులు కలెక్టర్‌ను అభ్యర్థించారు. అనంతరం డ్యామ్‌పైకి కలెక్టర్ చేరుకొని పైకి లేచిన గేట్‌ను పరిశీలించారు. గోస్తనీలోకి ప్రవహిస్తున్న నీటి ఉద్ధృతిని పరిశీలించారు. అనంతరం గేట్లు తెరిచేందుకు సంబంధించిన బ్యాలన్స్ రోప్‌ను పరిశీలించారు. సంఘటన కారణాలపై నీటిపారుదల శాఖ అధికారులను ప్రశ్నించారు. చాలా కాలం నుంచి గేట్ల మరమ్మతు పనులు జరగలేదని పలువురు రైతులు కలెక్టర్‌కు వివరించారు. ఈ విషయమై నీటిపారుదల శాఖ అధికారులను కలెక్టర్ ప్రశ్నించగా జివిఎంసి నుంచి నిర్వహణ నిధులు రాకపోవడం వల్ల మరమ్మతులు నిలిచిపోయాయన్నారు. జలాశయం నుంచి భారీగా నీరు గోస్తనీ నదిలోకి పోయినందున గేట్‌ను కిందకు దించే పనులను యుద్ధప్రాతిపధికన చేపట్టాలని ఆదేశించారు. సాయంత్రానికల్లా పూర్తి చేయగలమని సంబంధిత అధికారులు కలెక్టర్‌కు వివరించారు. జలాశయం గేటు లేచిపోవడం వల్ల వరద నీరు ప్రవహిస్తుందన్న సమాచారం అందుకున్న పలు గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో డ్యామ్ వద్దకు తరలివచ్చారు. వీరంతా డ్యామ్ పైకి రావడానికి ప్రయత్నించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి జనాన్ని అదుపు చేశారు. ఇదిలా ఉండగా సాయంత్రం 5 గంటల వరకు గేట్లను కిందకు తెచ్చే పనులు జరగడంతో వరద నీరు దాదాపు టిఎంసి నీరు వృధాగా బయటకు పోయింది. దీనిపై రైతులు ఆందోళన చెందుతున్నారు. సాయంత్రం 5 గంటలకు మరమ్మతు పనులు పూర్తి కావడంతో 4 నంబరు గేటును కిందకు దించారు. దీంతో అధికారులు, రైతులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
గోస్తనీ ఉద్ధృతికి కానిస్టేబుల్ మృతి
* నదిలో చిక్కుకుపోయిన ఎస్సై
* సహాయక చర్యలు చేపడుతున్న అధికారులు

జామి, జనవరి 21: తాటిపూడి జలాశయం గేటు తెగిన నేపథ్యంలో జామి గోస్తనీ పాత వంతెన వద్ద పహారా కాస్తున్న అగ్నిమాపక శాఖ కానిస్టేబుల్ నీటి ఉద్ధృతికి పడి మృతి చెందాడు. అగ్నిమాపక ఎస్‌ఐ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తాటిపూడి గేటు తెగిందన్న సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాకప సిబ్బంది జామి గోస్తనీ నది ఏరియాకు చేరుకొని పురాతన వంతెన వద్ద కాపు కాశారు. గల్లంతైన మహిళ కోసం గాలించారు. ఇంతలోనే నీటి ఉద్ధృతి ఎక్కువ కావడంతో కానిస్టేబుల్ సింహాచలం గల్లంతయ్యాడు. కాగా ఎస్సై నీటిలో చెట్టు పొద వద్ద చిక్కుకున్నాడు. గల్లంతైన కానిస్టేబుల్ సింహాచలం కోసం గాలించగా సుమారు 2కిలోమీటర్ల దూరంలో మృతదేహాన్ని గుర్తించారు. కానిస్టేబుల్ సింహాచలం జామి మండలం బంగార్రాజుపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి ఇదిలా ఉండగా నది మధ్యలో చిక్కుకుపోయిన ఎస్సై దిలీప్‌ను ఒడ్డుకు చేర్చేందుకు సహాయక చర్యలు చేపట్టారు. జిల్లా యంత్రాంగంతోపాటు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, మాజీ ఎమ్మెల్యే శోభా హైమవతి, మాజీ జెడ్పిటీసీ అల్లు జోగినాయుడు, జెడ్పీటీసీ పెదబాబు, సర్పంచ్ త్రివేణి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.