గుంటూరు

దోపిడీదారులను దరిచేరనీయకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు, జనవరి 21: ఆంధ్రప్రదేశ్ రామరాజ్యంగా అవతరించునున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. శనివారం మండల పరిధిలోని పాతమల్లాయపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి రావెల మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డికి నిద్రపట్టడం లేదన్నారు. దొంగలను దోపిడీదారులను, స్మగ్లర్లను దరి చేరనీయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామాల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందన్నారు. 12 వేల కోట్లతో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. అలాగే 2 వేల కోట్లతో రోడ్ల నిర్మాణాలు చేసిందన్నారు. గుంటూరు చానల్‌ను పెదనందిపాడు వరకు పొడిగించేందుకు చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించగా ఆర్థిక సమస్యలతో రాష్ట్రం సతమతమవుతున్నా సచివాలయ నిర్మాణం, రైతుల కోసం పట్టిసీమ, పోలవరం తదితర ప్రాజెక్టులతో రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వైస్ చైర్మన్ కుర్రి సుబ్బారెడ్డి, జెడ్పీటీసీ భాగ్యారావు, ఎంపిపి సిహెచ్ శ్రీనివాసరావు, సర్పంచ్ సిహెచ్ నాగేంద్రం, మండల దేశం పార్టీ అధ్యక్షుడు గింజుపల్లి శివరామప్రసాద్, పార్టీ నాయకులు వీరయ్యచౌదరి, జి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
నేర నియంత్రణలో రాజీపడొద్దు

గుంటూరు, జనవరి 21: నేరాల నియంత్రణలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గరాదని అర్బన్ ఎస్‌పి సర్వశ్రేష్ఠ త్రిపాఠీ పిలుపునిచ్చారు. శనివారం అర్బన్ పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. అర్బన్ పరిధిలోని బీట్‌లను ఈ-బీట్‌లుగా మార్పు చేశామని, వీటి నిర్వహణను సమర్థవంతంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎస్‌హెచ్‌ఒ, డిఎస్‌పి స్థాయి అధికారులు ఇందుకు సంబంధించి ఏవైనా సాంకేతిక సమస్యలు ఏర్పడితే వెంటనే పై అధికారులకు తెలియజేయాలని నిర్వహణ సులభతరం అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నగరంలో మద్యం దుకాణాలు సమయపాలన ఖచ్చితంగా పాటించితీరాలని, ఈ విషయంలో అధికారులు ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని హెచ్చరించారు. సమయపాలన పాటించని నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. మద్యం దుకాణాల యజమానులకు కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. మోటారు వాహనాల చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలని, అతిక్రమించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి స్టేషన్ పరిధిలో ఎస్‌హెచ్‌ఒలు విధిగా వాహన చోదకులకు చట్టం గురించి అవగాహన కల్పించాలని కోరారు.