మహబూబ్‌నగర్

టి-ఐపాస్‌తో పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 21: మహబూబ్‌నగర్ జిల్లాలో టి ఐపాస్ కింద దరఖాస్తు చేసుకున్న నూతన పారిశ్రామికవేత్తలకు ప్రొత్సహంతో పాటు తగిన సదుపాయాలు కల్పించడం జరుగుతుందని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ వెల్లడించారు. శనివారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన టి ఐపాస్ ఆమలుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ రోనాల్డ్ రోస్ మాట్లాడు తూ నూతన పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ప్రొత్సహించేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందన్నారు. పరిశ్రమలు నెలకొల్పడానికి కావల్సిన వౌలిక వసతులను జాప్యం లేకుండా అందించాలని అధికారులను ఆదేశించారు. సోలార్ ప్లాంట్, ప్లాస్టిక్ బా టిల్స్ తయారు చేసే పరిశ్రమలకు కావల్సిన భూసేకరణ వివరాలు అధికారలు అందించాలని సూచించారు. వీటికి దరఖాస్తు చేసుకున్న వారికి సదుపాయాలు అందించాలని అధికారులకు తెలిపారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 10యూనిట్ల ద్వారా వి విధ రకాల వాహనాలను అందించడం జరిగిందని రుణాలు పొందిన వాహనాలను పురుషులకు 35శాతం, మహిళలకు 45శాతం ప్రభుత్వం రాయితీ కల్పిస్తుందన్నారు. వాహనాల డాక్యూమెంటేషన్ పత్రాలు, రిడింగ్, రూట్ పర్మిషన్ ఏ ప్రదేశం నుండి ఏ ఏ ప్రదేశానికి వాహనం తిరిగే ప్రదేశాల్లో సం బందిత లబ్దిదారులను ఈ సమావేశంలోనే అడిగి తెలుసుకున్నారు. రు ణాలు పొందిన లబ్దిదారులు వారు అభివృద్ధి చెందుతూ పదిమందికి ఉపాధి కల్పించాలని అప్పుడే సమాజంలో అన్ని రుగ్మతలు తొలగుతాయన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రొత్సహాన్ని సద్వినియోగం చేసుకుని జిలా లో నిరుద్యోగ సమస్యను తీర్చడంలో నూతన పారిశ్రామికవేత్తలు దోహదపడాలన్నారు. ప్రతి నిరుద్యోగి ప్రభుత్వ ఉద్యోగం కోరకు వేచి చూడకుండా సొంత ఆలోచనలతో ఎదగాలని వారికి కావల్సిన శిక్షణ, రుణసదుపా యం ప్రభుత్వం కల్పిస్తుందని ప్రతి నిరుద్యోగ యువత ఆ దిశగా పయనించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూ తన పారిశ్రామిక విధానంతో వెనుకబడి పేదరికంలో ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళ్లడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల జనరల్ మేనేజర్ సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అక్షయపాత్రతో అంగన్‌వాడీ పిల్లలకు పౌష్టికాహారం
* సరుకుల పంపిణీలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు
* మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్

మహబూబ్‌నగర్, జనవరి 21: జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం (అక్షయపాత్ర)ద్వారా ప్రతి పేదల పిల్లలకు పౌష్టికాహరం అందించే భాద్యత ప్రతి అంగన్‌వాడీ కార్యకర్తపై, సిడిపిఓపై ఉందని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని తన నూతన చాంబర్‌లో ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ సిడిపిఓలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల విభజన తర్వాత కొన్ని అంగన్‌వాడీ కేంద్రాలు మన జిల్లాలో కలవడం, మన జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు ఇతర జిల్లాల్లో కలవడం వల్ల సరుకుల పంపిణీలో కొంత ఇబ్బందులు తలెత్తడవం వల్ల, పక్కా ప్రణాళికతో అంగన్‌వాడీ సెంటర్ నుండి సరుకుల పంపిణీ జరిగేవిధంగా సంబందిత అధికారులు పనిచేయాలని అన్నారు. జిల్లాలో సెక్టర్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. ప్రతి మండలానికి సూపర్‌వైజర్, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులపై అడిగి తెలుసుకున్నారు. నూతన జిల్లాలకు ఆర్‌ఓ రిలీజ్ చేయడం జరిగిందని కమీషనర్ తెలియజేశారు. సరుకుల పంపిణీలో ఇబ్బందులు తొలగుతాయని, సూపర్‌వైజర్లు అంగన్‌వాడీ సెంటర్ల విజిట్ రిపోర్టును తయారు చేయాలని తెలిపారు. సూపర్‌వైజర్ ఉన్న ప్రతి అంగన్‌వాడీ సెంటర్‌కు కంప్యూటర్, ఇంటర్నెట్ సౌకర్యం, విద్యుత్ సమకూరుస్తామని, సమర్థవంతంగా పనిచేయడానికి మీకు కావలసిన సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. అంగన్‌వాడీ ఆయాలకు అవసరమున్న ప్రదేశాలను గుర్తించాలని, కంప్యూటర్ ఆపరేటర్లు అవసరమున్న సెంటర్లను గుర్తించి నివేదికలు సమర్పించాలని అన్నారు. ప్రతి అంగన్‌వాడీ సెంటర్‌కు బియ్యం, పప్పులు, పాలు, నునె, గుడ్లు, బాలామృతం సరఫరాపై ఎప్పటికప్పుడు తెచ్చిన సరుకులు, పంపిణీ చేసిన సరుకుల నివేదికలు పంపాలని తెలిపారు. అలాగే పిల్లల హజరు శాతానికి సరిపోయే విధంగా చూసుకోవలసిన బాద్యత సిడిపిఓలు, సూపర్‌వైజర్లపై ఉందని అన్నారు. ప్రభుత్వం ఎన్నో నిధులు వెచ్చించి పేద పిల్లలకు పౌష్టికాహరం లోపం వల్ల వచ్చే రక్తహీనత, బరువు తక్కువగా ఉండే పిల్లలను దృష్టిలో పెట్టుకుని గర్భవతులకు పౌష్టికాహారం సమకూర్చి ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని చేరే విధంగా ఐసిడి ఎస్ అధికారులు కలిసి కట్టుగా పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సంక్షేమాధికారి గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.