తెలంగాణ

హైవేలపై ఇక మద్యం బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: జాతీయ రహదారుల్లో తరచూ భారీ ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మైనర్ పిల్లలు, రైడర్లు మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ, విన్యాసాలతో హల్‌చల్ చేస్తున్నారు. ఇవే కాకుండా మద్యం సేవించి వాహనాలు నడుపుతుండడం కూడా మరో కారణమని చెప్పవచ్చు. పోలీసులు చెకింగ్‌లు చేస్తున్నా, డ్రంకెన్ డ్రైవ్ చేపడుతున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచన చేస్తున్నది. ఇందులో భాగంగా జాతీయ రహదారులపై మద్యం విక్రయాలు జరగకుండా చూడాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులను చైతన్యవంతం చేయాలని ఆలోచన చేస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి. మహేందర్ రెడ్డి తెలిపారు. 28వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలను ఆదివారం నగరంలోని కెబిఆర్ జాతీయ పార్కులో హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ తదితరులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి ప్రసంగిస్తూ దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఏటా దేశంలో లక్షాల 50 వేల ప్రమాదాలు జరుగుతున్నాయని, తెలంగాణలో 7 వేల మంది మృత్యువాత పడుతున్నారని ఆయన తెలిపారు. వాహన చోదకులు రోడ్డు భద్రత నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆయన కోరారు. ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని ఆయన తల్లిదండ్రులను కోరారు. మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను, సందర్భాలను గుర్తించామన్నారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన విధంగా జాతీయ రహదారులపై మద్యం అమ్మకాలను నిలిపి వేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహాయంలో సిరిసిల్లలో 15 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న డ్రైవింగ్ శిక్షణ కేంద్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో డ్రైవర్లకు తర్పీదు ఇవ్వనున్నట్లు తెలిపారు. ‘నో హెల్మెట్-నో పెట్రోలు’ విధానాన్ని అమలు చేయాలని ఆయన పెట్రోలు బంకుల యజమానులను కోరారు. ఇంకా థియేటర్లలో రోడ్డ్భుద్రతపై లఘు చిత్రాలు ప్రదర్శించనున్నట్లు మంత్రి వివరించారు. విద్యా సంస్థల్లో సేఫ్టీ క్లబ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.