సబ్ ఫీచర్

తోలు బొమ్మల సోయగాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్వం ఆబాలగోపాలాన్నీ ఆనందింపజేసి, దివ్యంగా వర్ధిల్లిన కళారూపం తోలుబొమ్మలాట. అప్పుడు కళాకారుల జీవనోపాధికి ఢోకావుండేది కాదు. సినిమా విజృంభణతో ఆదరణ కరవైంది. కొంతమంది వేరే వృత్తుల్లోకి మరలిపోగా, అభిమానం ఉన్న కళాకారులు వృత్తేనే దైవంగా భావించారు. ‘బొమ్మ’లకు ఆధునికి సోయగాలు దిద్ది ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు.
**

అనంతపురం, నమ్మిలకుంట, ధర్మవరం ప్రాంతాల్లోని కళాకారులు తమ కళానైపుణ్యంతో ‘తోలుబొమ్మ’ను కాపాడుకుంటున్నారు. అనంతపురానికి చెందిన డి.పుల్లాయమ్మ చాముండేశ్వరి మహిళా సంఘం సభ్యురాలు. ప్రభుత్వ రుణం పొంది, తోలుబొమ్మలను తయారు చేస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తోంది. ప్రభుత్వ సహకారంతో ఆయా ఉత్సవాల్లో కేటాయించిన స్టాల్స్‌లో పెట్టి అమ్ముతోంది.
మేకచర్మంతో తయారు చేసిన వీటిని ఇళ్ళల్లో పెట్టుకుంటే, ఇంటికి ఎంతో మంచిదని ఆమె చెబుతోంది. 4 లేదా 5 వందల రూపాయలకు మేకచర్మాన్ని కొనుగోలు చేస్తాం. శుభ్రపరుస్తాం. డ్రాయింగ్ వేసి, రంగులు అద్దుతాం. ఎక్కువగా భారతీయ సంస్కృతీసంద్రాయాలను పాటించే కళాఖండాలు రూపొందిస్తాం.
ఇంకా, పురాణ, ఇతిహాసాల్లోని బొమ్మలు వేస్తాం. శ్రీరాముడు, సీత, ఆంజనేయుడు, దశవతారాలు వంటి బొమ్మలతోపాటు ఏనుగు, నెమలి చిత్రాలు వేస్తాం. వీటివల్ల ఇంటికి శుభం కలుగుతుంది. చూపురులకు ఆనందాన్ని ఇస్తుంది. పిల్లల్లో భక్త్భివం పెంపొందిస్తాయని చెబుతోంది పుల్లాయమ్మ. కొనే్నళ్ళ కిందిట తాము గ్రామదేవత ఉత్సవాలు, ఇతర సంబరాలను పురస్కరించుకుని, ఊళ్ళల్లో ప్రదర్శనలు ఇచ్చేవారం. ఆదరణ తగ్గడంతో మేమూ నేటి స్థితిగతులపై అవగాహన పెంచుకుని, కొత్తగా తయారుచేస్తున్నామని చెప్పారామె. ఒక్క దేవుడు బొమ్మలే కాకుండా, ఆధునిక ఇంటికి అవసరమైన వేలాడే విద్యుత్ లాంతర్లు, విద్యుత్ టేబుల్ స్టాండ్‌లను తయారుచేస్తున్నాం. స్వదేశీయులకంటే మా నైపుణాన్ని విదేశీయులు ఎక్కువగా ఆదరిస్తుండడం సంతోషంగా ఉంది. ఏడాదికి సుమారుగా 3,60,000 టర్నోవర్ జరుగుతుంది.
ఒక్క ఢిల్లీ ప్రదర్శనలో సుమారు రూ. 2 లక్షల వరకు విక్రయాలు జరుగుతుంటాయి. ఇతర ప్రదేశాల్లో ప్రదర్శనలకు అవసరమైన సాయాన్ని భర్త బాబూరావు సాయం తీసుకుంటానని చెప్పిందామె. తమవంటి కళాకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి, విరివిగా రుణాలు మంజూరు చేయాలి. ఈ కళపై ప్రజల్లో చైతన్యం తేవాలి. అప్పుడే ‘తోలుబొమ్మలాట’ సజీవంగా ఉంటుందని అభిప్రాయపడిందామె.

- జికె మూర్తి