రాష్ట్రీయం

ఇక చకచకా అసెంబ్లీ, హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 2: రాజధాని అమరావతిలో భవన నిర్మాణాలకు సంబంధించి పనులు ప్రారంభించేందుకు తేదీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఖరారు చేశారు. శాశ్వత అసెంబ్లీ భవన నిర్మాణాన్ని జూలై 20న, హైకోర్టు భవన నిర్మాణ పనులను ఆగస్టు 17న ప్రారంభించేందుకు నిర్ణయించారు. వెలగపూడి సచివాలయంలో రాజధాని నిర్మాణంపై సిఎం సమీక్ష నిర్వహించారు. మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్స్ సంస్థ రాజధాని తుది ఆకృతులను ఈ నెల 22న అందచేయనుంది. ఈ నేపథ్యంలో తదుపరి భవన నిర్మాణానికి సంబంధించిన అంశాలపై ఎపి సిఆర్‌డిఎ అధికారులతో చర్చించారు. ఏప్రిల్ 19 నాటికి అసెంబ్లీ, హైకోర్టుల తుది డిజైన్లను ఖరారు చేస్తారు. 3 అంతస్తుల్లో అసెంబ్లీ, నాలుగు అంతస్తుల్లో హైకోర్టు నిర్మించేందుకు ప్రతిపాదించారు. వచ్చే ఏడాది అక్టోబర్ 4 నాటికి అసెంబ్లీ భవనం పూర్తి చేసేందుకు లక్ష్యంగా నిర్ణయించారు. వచ్చే ఏడాది డిసెంబర్ నెలాఖరుకు హైకోర్టు భవనం నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రతిపాదించారు.