ఆంధ్రప్రదేశ్‌

పార్టీ ప్రతిష్ఠను దిగజార్చొద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 7: పార్టీ ప్రతిష్ఠను దిగజార్చితే సహించేదిలేదు.. నియమావళిని అతిక్రమించి క్రమశిక్షణ లోపించే వారిని ఉపేక్షించేదిలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఇటీవల జరిగిన పరిణామాలపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమై చర్చించారు. ఉండవల్లిలోని సిఎం నివాసంలో బాలయ్యకు సిఎం అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా పార్టీలో గ్రూపులపోరు, రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. హిందూపూర్ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇటీవల తన వ్యక్తిగత సహాయకుడు శేఖర్‌పై వచ్చిన అభియోగాలపై కూడా బాలయ్య సిఎంకు వివరించారు. రాష్ట్రంలోనే హిందూపూర్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ పరిస్థితుల్లో అభివృద్ధికి విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని సిఎం స్పష్టం చేశారు. హిందూపూర్‌లో ఏర్పాటవుతున్న స్టేడియం, ఇండస్ట్రియల్ పార్కు, తాగునీటి పథకాలు తదితర అభివృద్ధి పనులపై ఇరువురు చర్చించారు. సిఎం చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ అంతర్గత విభేదాలపై వివరాలు సేకరిస్తున్నామని, నివేదిక అందగానే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకు రావాలన్నారు. వ్యక్తిగత స్పర్థలతో సమావేశాలు, ఆందోళనలు నిర్వహిస్తే సహించేదిలేదని పునరుద్ఘాటించారు. పార్టీ సిద్ధాంతాలను గౌరవించాలని, క్రమశిక్షణ ఉల్లంఘించి బాధ్యతాయుతంగా వ్యవహరించే వారిపై, బహిరంగ ఆరోపణలతో రో డ్డెక్కినా ఉద్వాసన తప్పదని హెచ్చరించారు.