బిజినెస్

‘సౌర విద్యుదుత్పత్తిని ప్రోత్సహించాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 8: దేశీయ సౌర విద్యుదుత్పాదనలో తెలంగాణకు అగ్రస్థానం వస్తుందని, సౌర విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానం దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలంగాణ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా అన్నారు. 2019-20 నాటికి 5 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామన్నారు. సంవత్సరంలో 300 రోజుల పాటు సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు అనువైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయన్నారు. బుధవారం ఇక్కడ అసోచామ్, ఎఫ్‌టాప్సీ ఆధ్వర్యంలో సౌర విద్యుత్‌పై జరిగిన సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుడు డిసెంబర్ నాటికి రాష్ట్రంలో సౌరవిద్యుదుత్పాదన 1,070 మెగావాట్లకు చేరుకుందని, దీనిలో 27 మెగావాట్ల విద్యుత్ రూఫ్ టాప్‌ల ద్వారా వస్తోందన్నారు. కాగా, మరో రెండు వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు పరిశీలనలో ఉన్నాయన్న ఆయన సౌర విద్యుత్ ప్రాజెక్టు డెవలపర్ల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పరిశ్రమల రంగంలో తెలంగాణ హబ్‌గా తయారవుతోందన్నారు. టిఎస్‌ఇఆర్‌సి చైర్మన్ ఇస్మాయిల్ అలీ ఖాన్ మాట్లాడుతూ సంప్రదాయ, సంప్రదాయేతర విద్యుత్‌ల సమ్మిళతంగా ప్రణాళికలు ఉండాలన్నారు. సౌర విద్యుత్ చౌకగా లభిస్తోందని, సౌర విద్యుదుత్పాదన పెరగడం, పరిశ్రమలు రావడం, ఉపాధి లభించడం వల్ల సామాజికంగా ఆనందం వెల్లివిరిస్తుందన్నారు. ఎఫ్‌టాప్సీ చైర్మన్ రవీంద్ర మోదీ మాట్లాడుతూ జాతీయ సోలార్ మిషన్ ద్వారా 2022 నాటికి వంద గిగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ సమావేశంలో కిషోర్ నాయర్, మనీషా సింఘాల్, అసోచామ్ తెలంగాణ చైర్మన్ బాడిగ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.