రాష్ట్రీయం

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ పురోగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 8: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం గణనీయమైన పురోగతి సాధించిందని ఇన్పోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అన్నారు. ముఖ్యంగా ప్రజారోగ్యం విషయంలో ముందున్నామని ఆయన తెలిపారు. ఈ నెల 6న ప్రారంభమైన ప్రతిష్టాత్మమైన బయో-ఆసియా సదస్సు బుధవారం నారాయణ మూర్తి కీలకోపన్యాసంతో ముగిసింది. వ్యాక్సిన్ల తయారీలోనూ చాలా ముందున్నామని చెబుతూ రోటావైరస్ వ్యాక్సిన్‌ను ఉదహరించారు. అయితే రాష్ట్రాల మధ్య తేడాలున్నాయని, కొన్ని విషయాల్లో ఉత్తరాది రాష్ట్రాల కంటే దక్షిణాది రాష్ట్రాల పని తీరు బాగుంటున్నదని అన్నారు.మంత్రి తారక రామారావు మాట్లాడుతూ మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ సదస్సు విజయవంతమైందని అన్నారు. ఫార్మా రంగ సమస్యల పరిష్కారంలో తమ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్నదని ఆయన తెలిపారు. కొత్త వ్యాధులపై పరిశోధనలు ఇంకా జరగాల్సి ఉన్నదని, అదేవిధంగా ఔషధాలు ప్రజలకు అందుబాటు ధరల్లో ఉండాలని ఆయన తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, యుకె-జిఎస్‌కె ఆర్‌అండ్‌డి అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ వ్యాలెన్స్ తదితరులు ప్రసంగించారు. హెచ్‌ఐసిసిలో జరిగిన ఈ సదస్సులో 51 దేశాల నుంచి 1480 ప్రతినిధుల పాల్గొన్నారు.