తెలంగాణ

ఇంటర్ బోర్డుకు ప్రతిష్ఠాత్మక అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 8: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డుకు ప్రతిష్టాత్మక ‘పాలసీ మేకర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు లభించింది. ఉన్నత విద్యా రంగంలో ఐసిటి టెక్నాలజీ ఆధారంగా తీసుకు వచ్చిన సంస్కరణలు, తదనంతర ఫలితాలకు ఈ అవార్డు దక్కింది. న్యూ ఢిల్లీలో జరిగిన 2017 ఇండియన్ ఎడ్యుకేషన్ కానె్ఫరెన్స్‌లో 7వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో ‘ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్’ కేటగిరిలో తెలంగాణ ఇంటర్ బోర్డుకు అవార్డు లభించింది. ఈ అవార్డును ఇంటర్‌బోర్డు కార్యదర్శి, కమినర్ డాక్టర్ ఎ.అశోక్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో తీసుకున్న చొరవ, సంస్కరణల ఆధారంగా ఈ అవార్డు లభించిందని తెలిపారు. ఉచిత విద్య, పాఠ్యపుస్తకాల పంపిణీ, డిజిటల్ లెర్నింగ్ వంటి వాటిని అమలు చేయడం వల్ల విద్యారంగంలో ఉత్తమంగా నిలిచామని తెలిపారు. డిజిటల్ తెలంగాణ లక్ష్యానికి అనుగుణంగా తమ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తులో మరిన్ని సంస్కరణలకు దోహదపడతాయని ఆయన అన్నారు.