ఆంధ్రప్రదేశ్‌

ముద్రా రుణాలకూ ష్యూరిటీలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 9: చిన్న తరహా వ్యాపారులకు ఎటువంటి ష్యూరిటీ లేకుండా రుణాలు ఇవ్వాల్సిన ముద్రా రుణాలకు బ్యాంకర్లు ష్యూరిటీ అడుగుతున్నారని రాష్ట్ర పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు బివి రామారావు ఆందోళన వ్యక్తంచేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. చిరు వ్యాపారుల కోసం ప్రవేశపెట్టిన ముద్ర పథకంపై అందరికీ అవగాహన కల్పించాలన్నారు. ముద్ర పథకం ద్వారా రూ.50వేల నుంచి రూ.10 లక్షల వరకు ఏ విధమైన ష్యూరిటీ లేకుండానే 49 బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చన్నారు. అయితే బ్యాంకర్లు ష్యూరిటీ లేకుండా రుణాలు ఇవ్వకపోవడం వల్ల పథకం ప్రయోజనం నీరుగారిపోతోందన్నారు. రుణాలు ఇవ్వడంలో బ్యాంకర్లు ఇబ్బంది పెడితే తన దృష్టికి తీసుకురావాలని, 9866649369 నెంబర్‌కు సంప్రదించాలని కోరారు. ముద్రా రుణాలను సక్రమంగా అమలు జరిగేలా పర్యవేక్షించడానికి జిల్లాల వారీగా కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. త్వరలోనే ప్రధాని మోదీని కలిసి ఈఅంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్తానని రామారావు తెలిపారు.