ఆంధ్రప్రదేశ్‌

శభాష్.. పోలీస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 12: అంతర్జాతీయ ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్వహించిన జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు సక్సెస్ అయింది.. భద్రతా ఏర్పాట్లలో బెజవాడ పోలీసుశాఖ ప్రణాళిక.. నెలరోజుల కృషి ఫలించింది. శాంతిభద్రతలు, ట్రాఫిక్ క్రమబద్దీకరణ, ప్రముఖులకు రక్షణ వంటి కీలక అంశాలను చక్కగా నిర్వహించడంలో నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ కృతకృత్యులయ్యారు. విజయవాడ డిసిపి జి పాలరాజు పర్యవేక్షణలో రాష్ట్రంలోని 13జిల్లాల నుంచి తరలివచ్చిన సుమారు ఐదువేల మందికి పైగా బందోబస్తు విధులు నిర్వహించారు. 30 రోజులుగా చేసిన కృషి, ప్రణాళిక, శిక్షణతో అవిశ్రాంత విధులు నిర్వహించిన ఉన్నతాధికారుల నుంచి హోంగార్డు వరకు సదస్సు విజయవంతంతో ఊపిరి పీల్చుకున్నారు. మహిళల భాగస్వామ్యంతో మహిళల కోసం ఉద్ధేశించిన సదస్సుకు కల్పించిన భద్రత, బందోబస్తు విధుల్లో కూడా మహిళా పోలీసులే కీలక భూమిక పోషించడం ఇది తొలిసారి. పైగా.. విఐపిలకు కల్పించే ‘పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్’ విధులు కూడా మహిళా పోలీసు అధికారులే నిర్వహించారు. ఇందుకోసం వీరికి నెల రోజులుగా ఫైరింగ్‌తో సహా అన్ని అంశాల్లో శిక్షణ ఇచ్చారు. బందోబస్తు, భద్రతా నిర్వహణకు సంబంధించి మూడు కేటగిరీలుగా విభజించారు. దేశ విదేశాల నుంచి తరలివచ్చిన ప్రముఖ అతిధుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే సెక్యూరిటీ, ఎస్కార్ట్, పైలట్, గన్‌మెన్ వంటి విధులన్నీ కూడా మహిళా పోలీసులే నిర్వహించారు. అతిధులు బస చేసే ప్రదేశాలు, వారు పర్యటించే ప్రాంతాలు, అదేవిధంగా వేదిక ప్రాంగణం వరకు సాగించే రాకపోకల సమయాల్లో వారి వెంటే ఉంటూ రక్షణ కల్పించారు. ఇందుకోసం కానిస్టేబుల్ నుంచి సిఐ స్థాయి వరకు సుమారు 110 మంది మహిళా పోలీసు అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించారు.
అదేవిధంగా సదస్సుకు హాజరయ్యే 12వేల మంది ప్రతినిధులకు కూడా రక్షణ కల్పించింది మహిళా పోలీసులే. 12వేల మందికి 46చోట్ల విడిది ఏర్పాటు చేశారు. ఈ 46చోట్ల కూడా ప్రత్యేకంగా వారి కోసం ఏర్పాటు చేసిన బస్సులు రాకపోకలు, పర్యటనలకు సంబంధించి వారికి భద్రత కల్పిస్తూ మరో 200 మంది సిఐ నుంచి కానిస్టేబుల్ వరకు మహిళా సిబ్బంది సమర్ధవంతంగా విధులు నిర్వహించారు. ఇక సదస్సు జరిగిన చోట వేదిక వద్ద డిఎస్పీ ఆపై స్థాయి అధికారులు పర్యవేక్షించారు. ఫుడ్ కోర్టు, విఐపి ఫుడ్ లాంజ్ తదితర చోట్ల ఇద్దరు ఎస్పీలు, 16మంది డిఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారు. కల్చరల్ విభాగం వద్ద జనరల్ పబ్లిక్ కూడా అనుమతి ఇవ్వడంతో భద్రత బాధ్యత రెట్టింపయింది. అయినా అలిసిపోని మహిళా పోలీసు సిబ్బంది సుమారు 400 మంది యూనిఫారం లేకుండా కేవలం సఫారీ దుస్తుల్లో చిరునవ్వుతో మర్యాదంగా వ్యవహరిస్తూ ఇటు విధులను మరోవైపు భద్రతా చర్యలను బ్యాలెన్స్‌గా నిర్వహించడం గమనార్హం. వీరితోపాటు యూనిఫారం లేకుండా ఇన్‌విజుబుల్ పోలీసింగ్‌ను అమలు చేస్తూ 20 మహిళా రక్షక్ బృందాలు పని చేశాయి. బృందానికి ఐదుగురు చొప్పున మొత్తం 200 మంది మహిళా సిబ్బంది ఉన్నారు. మూడు రోజుల పాటు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు రెండు షిఫ్టుల కింద అలుపు లేకుండా పని చేసిన పోలీసులు ప్రశాతంగా సదస్సులు ముగియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటైన 200మంది మహిళామిత్ర సభ్యులను బందోబస్తు విధుల్లో స్వచ్చందంగా వినియోగించుకోవడం కూడా మరో ప్రాముఖ్యమైన అంశం. ఇక జాతీయ మహిళా సదస్సులో నిఘా పటిష్టంగా అమలు చేశారు. భద్రతా, రక్షణ విధుల్లో 13 జిల్లాల నుంచి ఐదు మంది ఎస్పీ స్థాయి అధికారులు, 26మంది డిఎస్పీలు, 50మంది సిఐలు, 100 మంది ఎస్‌ఐలు, వీరు కాకుండా ఐదు వేల మంది సిబ్బంది పాల్గొన్నారు. నిఘా విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా రెండు డ్రోన్లతో నిఘా పర్యవేక్షణ, 211 సిసి కెమేరాలు ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా 50 బాడీఓర్ కెమేరాలు కూడా వినియోగించారు. 200 వైర్‌లెస్ సెట్లు, 20 పోలీసు జాగిలాలు, మరో 20 బాంబు డిస్పోజ్‌బుల్ బృందాలు పని చేశారు. మొత్తం మీద భారమైనా రెండు షిఫ్టుల్లో పని చేసిన పోలీసు సిబ్బంది, అధికారులు సదస్సు విజయవంతం కావడంతో వారి నెలరోజుల కృషి ఫలించింది.