ఆంధ్రప్రదేశ్‌

హంద్రీనీవాలో ఆగిన పరవళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అనంత’కు 26 టిఎంసిల పంపింగ్
శ్రీశైలంలో తగ్గిన నీటిమట్టం

అనంతపురం, ఫిబ్రవరి 19 : కర్నూలు, అనంతపురం

జిల్లాలకు తాగు, సాగునీరు అందించేందుకు

ఏర్పాటు చేసిన హంద్రీనీవా సుజల స్రవంతి

(హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) కాలువకు కృష్ణా జలాలు

ఆగిపోయాయి. ఇందుకు శ్రీశైలం జలాశయంలో నీటి

మట్టం 837 అడుగులకు పడిపోవడమే కారణం.

దీంతో కర్నూలు జిల్లా మల్యాల వద్ద హంద్రీనీవా

కాలువకు ఏర్పాటు చేసిన 6 పంపులను శనివారం

రాత్రి నిలిపివేశారు. నాగార్జునసాగర్ ఆయకట్టుకు

నీరు విడుదల చేస్తున్న నేపథ్యంలో శ్రీశైలంలో నీటి

మట్టం భారీగా తగ్గిపోయినట్లు హంద్రీనీవా

అధికారులు తెలిపారు. దీంతో వచ్చే వర్షాకాలం

వరకూ హంద్రీనీవాకు నీటి విడుదల ఉండదన్నారు.

కాగా ఇప్పటి వరకూ ఆయకట్టుకు నీరు విడుదల

చేయకపోవడం వల్ల రాబోయే వర్షాకాలం జూలై,

ఆగస్టు వరకూ ఆగక తప్పని పరిస్థితి ఏర్పడింది.

శ్రీశైలం జలాశయంలో గత ఏడాది వర్షాకాలంలో 885

అడుగులకు నీటి మట్టం చేరిన సమయంలో

హంద్రీనీవాకు నీటి విడుదల కోసం ప్రభుత్వం

సన్నాహాలు చేసింది. ఈ సందర్భంగా 881 అడుగుల

నీటి మట్టం ఉన్నప్పటి నుంచి కర్నూలు జిల్లా

మల్యాల వద్ద ఏర్పాటు చేసిన పంపుల్లో ఆరింటి

ద్వారా నీటి తోడి పోయడం ప్రారంభించారు. 2016

ఆగస్టు 10వ తేదీ నుంచి సుమారు 4 నెలల పాటు

నీటిని నిరంతరాయంగా పంపింగ్ చేశారు. ఇప్పటి

వరకూ సుమారు 26 టిఎంసిల నీటిని హంద్రీనీవా

ఫేజ్-1లోని జీడిపల్లికి, ఫేజ్-2లోని గొల్లపల్లి

రిజర్వాయర్‌కు తరలించారు. శనివారం వరకూ

కూడా జిల్లాలోని వజ్రకరూరు మండల పరిధిలోని

రాగులపాడు వద్ద 2 పంపులతో నీటిని

ఎత్తిపోస్తున్నారు. జీడిపల్లి జలాశయానికి రోజూ 1800

క్యూసెక్కులు నీటిని పంపింగ్ చేశారు. అనంతపురం

జిల్లాకు 14-15 టిఎంసిలు మాత్రమే నీటిని ఎత్తి

పోయాలని ప్రభుత్వం నిర్ణయించినా, శనివారం రాత్రి

వరకూ 26 టిఎంసిలు పంపింగ్ చేసినట్లు

అధికారులు చెప్పారు. అయితే వచ్చిన ఈ నీటిని

కర్నూలు జిల్లా బిబిసి, ఆలూరు బ్రాంచి కెనాల్,

పిఎబిఆర్, గొల్లపల్లి, ఎంపిఆర్‌కు సరఫరా చేశారు.

పిఎబిఆర్ ద్వారా సుమారు 38 చెరువులకు,

చెక్‌డ్యామ్‌లకు నీరు సరఫరా చేశారు. కాగా

హంద్రీనీవా ప్రధాన కాలువ పక్కన భూములున్న

రైతులు నీరొస్తుందన్న ఆశతో రెండో దఫా కూడా

పంటలు సాగు చేశారు. అయితే నీరు రాకపోతే

కాలువ పక్కనున్న భూములను సైతం మరో 7

నెలల పాటు బీడు పెట్టుకోక తప్పని పరిస్థితి

ఏర్పడింది. ప్రస్తుతం జీడిపల్లి రిజర్వాయర్ వద్ద

నుంచి ప్రధాన కాలువ పక్కన రెండో పంట

వేసుకున్న రైతులు నష్టపోయే పరిస్థితి లేకపోలేదు.

కాగా జిల్లాకు హంద్రీనీవా నీరు వచ్చినా ఇంత

వరకూ లక్షలాది ఎకరాల ఆయకట్టుకు

నీరివ్వకపోవడం వల్ల భూములు బీడుగానే

ఉండిపోయాయి.