Others

నాకు నచ్చిన పాట--తెల్లచీరకు తకధిమి తకధిమి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1980వ దశకంలో విడుదలైన చిత్రం -ఆఖరి పోరాటం. అప్పటికి నేను హైస్కూల్ చదువుతున్నాను. నాగార్జున, శ్రీదేవి, సుహాసిని హీరో హీరోయిన్లుగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన చిత్రమే ఆఖరి పోరాటం. ఆ సినిమాలోని పాట ‘తెల్లచీరకు తకథిమి తగథిధిమి తాకేనమ్మ సందె పొద్దుల్లో’. అశ్లీలతకు తావులేకుండా చిత్రీకరించిన ఈ రొమాంటిక్ సాగ్ చూడ్డానికే కాదు, వినడానికి చాలా బావుంటుంది. వినసొంపైన ఎస్పీ బాలు గాత్రం ఒక ప్లస్ అయితే, చిత్రమైన తెలుగు ఉచ్ఛారణతో శ్రీదేవి గొంతుకు అతికినట్టు పాడిన లతామంగేష్కర్ స్టయిల్‌ని ఎప్పటికీ మర్చిపోలేం. వేటూరి సాహిత్యం, ఇళయరాజా సంగీతం సరిగ్గా అమరి -పాట మనల్ని ఎక్కడికో తీసుకుపోతుంది. అందుకే ఈ పాట -నేటికీ చెవికోసుకొనే పాట అయిపోయింది. ముఖ్యంగా తెలుగును హిందీ గాయకులు పాడే తీరు ఎప్పుడూ తమాషాగానే వుండి ఆదరించబడుతూనే వుంది. మహ్మద్ రఫీ, ఆశాభోంస్లే, ఉదిత్‌నారాయణ్, కుమార్‌సాను, సుఖ్‌వీందర్‌లు ఆ విషయాన్ని మరోసారి నిరూపించారు. ‘నిదురపోరా తమ్ముడా’(‘సంతానం’ సినిమా) తర్వాత లతాజీ పాడిన పాట ఇదేనేమో! నాగార్జున, శ్రీదేవిలు తెల్ల డ్రస్సుల్లో గంధర్వుల్లా నాట్యం చేస్తుంటే, దర్శకేంద్రుని సెట్టింగుల్లో ఆ పాట ప్రాణం పోసుకొంది. ఎందుకనో ఆ పాట వాళ్ళు ఎంతో ఆనందంతో, సంతోషంగా పాడుకొంటున్నట్లనిపించినా, అంతర్లీనంగా దుఃఖాంతవౌతుందేమో వారి ప్రేమ అన్పిస్తుంది, ఆ మ్యూజిక్ వల్ల. అందుకేనేమో ‘మేస్ట్రో’ అయ్యాడు ‘ఇళైజ్ఞాని’. ‘ఆకాశం’, ‘హేమంతం’ వంటి పదాలు లతా మేడం ఒత్తిఒత్తి, విరిచి విరిచి పలుకుతుంటే అదే ఆకర్షణగా అనిపించింది. అక్కాచెల్లెళ్లిద్దరూ తెలుగులో పాడినా, ఇద్దరి గొంతులూ కొంచెం దగ్గర దగ్గరగావున్నా, చెల్లెలే కొన్ని ఎక్కువ పాడినా, అక్క పాడినవి గంగిగోవు పాలు. ఇప్పటికీ ఆ పాట ఎక్కడైనా వినిపించినా, చూసే అవకాశం వచ్చినా శిలాప్రతిమలా నిల్చిపోయి ఆస్వాదించడమే అలవాటు.

-కాళిదాసు, కావలి