రాష్ట్రీయం

వెనక్కి తగ్గేదిలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారని, ఆశలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని తెలంగాణ సంయుక్త కార్యాచరణ కమిటీ (టి.జాక్) చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజాకాంక్ష మేరకు ప్రభుత్వ నిర్ణయాలు లేకపోవడం వల్లే టి.జాక్ ఆందోళనాబాట పట్టిందన్నారు. నిరుద్యోగుల నిరసన ర్యాలీతో ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టాయని, దాంతో ర్యాలీని భగ్నం చేసేందుకు ప్రయత్నించారన్నారు. ర్యాలీకి ముందే అర్థరాత్రి తనను, టి.జాక్ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విరుద్దమన్నారు. ఐదువేల మందిని అరెస్ట్ చేశారని, నిరసన ర్యాలీ చేపట్టేందుకు ఎంపిక చేసిన స్థలంలో పోలీసులు భారీగా మొహరించడం పరిశీలిస్తే తెలంగాణలో ఎలాంటి ప్రజాస్వామ్యం ఉందో ప్రజలకు అర్థమవుతోందన్నారు. హాస్టళ్ల వద్ద పోలీసు బలగాలు పెట్టినా, తలుపులు విరగ్గొట్టి తనను అరెస్ట్ చేసినా, నిరసన ర్యాలీ విజయవంతమైందన్నారు. నిరసన ర్యాలీ నిర్వహించడంలో సంపూర్ణ విజయం సాధించామన్నారు. నిరసన ర్యాలీ సందర్భంగా ప్రభుత్వ ప్రవర్తనను స్వామి అగ్నివేశ్ ఖండించారని గుర్తు చేశారు. యోగేంద్రయాదవ్, ప్రశాంత్ భూషణ్ తదితరులు ఫోన్ చేసి వివరాలు తీసుకున్నారన్నారు. ఈ అంశంపై విద్యార్థులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులతో సవివరంగా చర్చిస్తామన్నారు. ప్రజా సమస్యలపై మరొక పర్యాయం టి.జాక్ విస్తృతస్థాయి సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని ప్రకటించారు. శాసనసభలో చర్చ జరిగితే పూర్తి వివరాలు ఎమ్మెల్యేలకు తాము అందిస్తామని కోదండరాం తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులకు భూములు సేకరించడానికి తాము వ్యతిరేకం కాదని, అయితే ఈ సేకరణ శాస్ర్తియ విధానంలో ఉండాలన్నారు. రైతులకు ఎట్టి పరిస్థితిలోనూ నష్టం జరగకుండా చూడాలని, అయితే ప్రభుత్వం నిర్లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఇప్పటికే భూనిర్వాసితుల అంశంపై వివిధ వేదికల ద్వారా చర్చలు జరిపామని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ప్రభుత్వ నిర్ణయాలను కోర్టులు తప్పుపట్టినా పాలకులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఈ నేపథ్యంలో నిర్వాసితుల పరిస్థితిని భారత రాష్టప్రతికి వివరించేందుకు ఢిల్లీ వెళ్తున్నామన్నారు.
సుధీర్ కమిటీ సిఫార్సులను యథాతథంగా అమలు చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. ఈ అంశంపై జిల్లాస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. మహబూబ్‌నగర్‌లో మార్చి 1న, నిజామాబాద్‌లో 4న సమావేశాలు నిర్వహిస్తామని, ఇతర ప్రాంతాల్లో నిర్వహించే సమావేశాల తేదీలు త్వరలో ప్రకటిస్తామన్నారు.
పోలీసులే దౌర్జన్యం చేస్తే ఎలా?
అసాంఘిక శక్తులు దౌర్జన్యం చేస్తే రక్షణ కోసం పోలీసుల వద్దకు వెళ్తామని, అలాంటిది పోలీసులే దౌర్జన్యంగా ప్రవర్తించి తలుపులు విరగ్గొట్టి కోదండరామ్‌ను అరెస్ట్ చేయడం శోచనీయమని విమలక్క వ్యాఖ్యానించారు. విమలక్క మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు సొంత రాష్ట్రంలో ఉన్నామా? సరిహద్దుల్లో ఉన్నామా? అని ఆలోచించాల్సి వస్తోందన్నారు. నిరుద్యోగుల నిరసన ర్యాలీ సందర్భంగా రాజ్యాంగ ఉల్లంఘనకు ప్రభుత్వం పాల్పడిందని ఆరోపించారు. మరో ఉద్యమానికి సిద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు.
పిట్టల అసంతృప్తి.. వాకౌట్
టి.జాక్ స్టీరింగ్ కమిటీ సమావేశం గురువారం కోదండరాం ఇంట్లో జరగగా, సమావేశాన్ని టి.జాక్ కన్వీనర్ పిట్టల రవీందర్ బహిష్కరించారు. గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, కోర్టు అనుమతి ఇచ్చిన చోటే ర్యాలీ నిర్వహించి ఉంటే నిరుద్యోగుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉండేదన్నారు. పార్టీల మద్దతుకన్నా ప్రజల మద్దతు టి.జాక్‌కు అవసరమని, రెండురోజుల్లో మీడియా ముందుకు వచ్చి అన్ని వివరాలు వెల్లడిస్తానని ప్రకటనలో పేర్కొన్నారు.