తెలంగాణ

కాపలా కుక్కే కాటేస్తోంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, ఫిబ్రవరి 23: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకోసం జరిగిన ఉద్యమ సమయంలో తెలంగాణ వస్తే కాపలా కుక్కలా ఉంటానన్న కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఉద్యమకారులను కాటేస్తున్నారని, కాపలా కుక్కే కాటేస్తే ఎలా అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి ప్రశ్నించారు. మిర్యాలగూడలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగుల సమస్యలపై జెఎసి ర్యాలీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా నిరసన ర్యాలీ నిర్వహించడానికి ఒకరోజు ముందే తలుపులు పగులగొట్టి జెఎసి కన్వీనర్ కోదండరామ్‌ను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని ఆయన అన్నారు. కోదండరామ్‌ను డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను అరెస్ట్ చేయడం పట్ల ఆయన తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో కెసిఆర్ పాలన పోలీసు రాజ్యాన్ని తలపిస్తోందని ఆయ న అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం అందరి హక్కు అని, నిరసన కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోవడం శోచనీయమని, ముఖ్యమంత్రి కెసిఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీ సాక్షిగా 1.07 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తామని హామీ ఇచ్చి కేవలం 10వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీచేశారని ఆయ న అన్నారు. ఖాళీ పోస్టులను భర్తీచేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగులు, యువత సహకారంతోనే ఉద్య మం సాగి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏ ర్పడిందని, అలాంటి నిరుద్యోగులు కనె్నర్ర చేస్తే కెసిఆర్ పతనం ఖాయమని ఆయన అన్నారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, సిఐటియు నాయకుడు మహ్మద్‌బిన్‌సయిద్, మల్లు గౌతంరెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఖమ్మంపాటి శంకర్, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు రవినాయక్, రెహమాన్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.