తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 24 February 2017
నకిరేకల్: నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బస్సు ముందు వెళ్తున్న కెమికల్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. మరో 20 మందికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీని వెనుక నుంచి వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటన జిల్లాలోని నకిరేకల్ మండలం ఐటిపాముల సమీపంలో 65వ నంబరు జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. క్షతగాత్రులు నార్కెట్పల్లి కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.