తెలంగాణ

న్యాయవ్యవస్థలో సంస్కరణలపై నేటినుంచి జాతీయ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: న్యాయవ్యవస్థలో సంస్కరణలు అనే అంశంపై రెండు రోజుల పాటు జాతీయ స్థాయి సదస్సును ఈ నెల 25 నుంచి హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ సొసైటీ ఫర్ ఫాస్ట్ జస్టిస్ ప్రతినిధి నజీర్ ఖాన్ తెలిపారు. ఒయులోని పిజిఆర్‌ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్లాటినమ్ జూబ్లీ ఆడిటోరియంలో ఈ సదస్సు జరుగుతుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేస్తున్న ప్రతినిధులు ఈ సమావేశంలో ప్రసంగిస్తారని తెలిపారు. దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, ఉమ్మడి హైకోర్టు మాజీ జడ్జి బి.చంద్రకుమార్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌కుమార్ తదితరులు ఈ సదస్సుకు హాజరవుతున్నారని నజీర్ తెలిపారు.