తెలంగాణ

ఈసారీ భారీ బడ్జెట్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 28: వృద్ధి రేటులో తెలంగాణ దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. బడ్జెట్‌లో సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో 19 నుంచి 20 శాతం వరకు వృద్ధిరేటు ఉందని, దీనికి తగ్గట్టుగానే బడ్జెట్ ఉంటుందని అన్నారు. గత బడ్జెట్ కన్నా ఈసారి బడ్జెట్‌లో జిఎస్‌టి ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ట్రెజరీ ఉద్యోగుల సంఘం డైరీని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ దేశంలోనే నంబర్ వన్‌గా తెలంగాణ దూసుకువెళ్తోందని, రాష్ట్రం మరింత వేగంగా దూసుకు వెళుతుందని అన్నారు. కొత్త రాష్ట్రంపై ప్రజలు చాలా ఆశలతో ఉన్నారు, వారి ఆశలను నెరవేర్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని, ఉద్యోగులు తమ బాధ్యతలు నిర్వహించాలని అన్నారు. గతంలో కోటి రూపాయలు ఖర్చు చేయని శాఖల్లో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. ఆర్థిక ప్రగతిలో దేశంలో నంబర్ వన్ స్థానంలో నిలిచాం, ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి అందరం సమష్టిగా కృషి చేయాలని అన్నారు.
ఉద్యమ సమయంలో ఉద్యోగులు తెలంగాణ ఏర్పడిన తరువాత రెండు గంటల పాటు అదనంగా పని చేస్తామని చెప్పారని, ప్రజల కోసం కృషి చేస్తున్నామని గుర్తించి పని చేయాలని అన్నారు. పనిని భారంగా భావించవద్దని, ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందని భావించాలని అన్నారు. ఉద్యోగులపై పని భారం ఎక్కువగా ఉన్న విషయం వాస్తవమేనని, ఖాళీలను భర్తీ చేయడం ద్వారా పని భారం తగ్గిస్తామని చెప్పారు. ట్రెజరీ శాఖ రాష్ట్రానికి గుండె కాయ లాంటిదని, ఈ శాఖకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్టు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.