బిజినెస్

మార్కెట్లకు జిఎస్‌టి జోష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 6: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలను అందుకున్నాయి. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలుకు మార్గం సుగమం కావడంతో మదుపరులు పెట్టుబడులతో కదం తొక్కారు. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ రెండేళ్ల గరిష్ఠాన్ని చేరగా, 215.74 పాయింట్లు పుంజుకుని 29,048.19 వద్ద ముగిసింది. 2015 మార్చి 5 తర్వాత ఈ స్థాయికి సెనె్సక్స్ చేరుకోవడం ఇదే ప్రథమం. నాడు 29,448.95 వద్ద సెనె్సక్స్ ఉంది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం రెండేళ్ల గరిష్ఠ స్థాయిని తాకుతూ 65.90 పాయింట్లు అందుకుని 8,963.45 వద్ద స్థిరపడింది.
ఇది 2015 మార్చి 3 తర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే. నాడు 8,996.25 వద్ద ఉంది. సెంట్రల్ జిఎస్‌టి (సి-జిఎస్‌టి), ఇంటిగ్రేటెడ్ జిఎస్‌టి (ఐ-జిఎస్‌టి) తుది డ్రాఫ్ట్‌ను గత వారం ఆల్-పవర్‌ఫుల్ జిఎస్‌టి కౌన్సిల్ ఆమోదించినది తెలిసిందే. ఇది స్టాక్ మార్కెట్లకు జోష్‌నివ్వగా, సూచీలు లాభాల్లో పరుగులు పెట్టాయి. చివరకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచుతుందన్న అంచనాలనూ మదుపరులు పట్టించుకోలేదు.
కాగా, మదుపరుల్లో జిఎస్‌టి అమలు, రాష్ట్రాల ఎన్నికలు, విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉత్సాహం కనిపిస్తోందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిసెర్చ్ అధిపతి వినోద్ నాయర్ అన్నారు. ఇకపోతే చమురు, గ్యాస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆటో, పవర్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు అధికంగా లభించగా, ఈ షేర్ల విలువ 1.32 శాతం మేర ఎగబాకింది. అత్యధికంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ల విలువ ఎగిసింది. సోమవారం ట్రేడింగ్‌తోపాటు గత శుక్రవారం ట్రేడింగ్‌లో రిలయన్స్ షేర్ల విలువ దాదాపు 4 శాతం పెరగగా, దాని మార్కెట్ విలువ 23,291 కోట్ల రూపాయలు ఎగిసి 4,23,307.09 కోట్ల రూపాయలకు చేరింది. సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి బిఎస్‌ఇలో రిలయన్స్ షేర్ విలువ అంతకుముందుతో పోల్చితే 3.69 శాతం పెరిగి 1,304.90 వద్ద నిలిచింది. ఎన్‌ఎస్‌ఇలో కూడా 3.71 శాతం వృద్ధి చెంది 1,305.35 వద్ద స్థిరపడింది.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే ఆసియా మార్కెట్లలో చైనా, హాంకాంగ్ సూచీలు లాభపడగా, జపాన్ సూచీ నష్టపోయింది. ఉత్తరకొరియా క్షిపణుల ప్రయోగంతో యెన్ విలువ పెరగడమే ప్రధాన కారణం. వీటిలో మూడు క్షిపణులు జపాన్ జలాల్లో దిగడంతో మదుపరుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇదిలావుంటే ఐరోపా మార్కెట్లలో కీలక సూచీలు ఆరంభంలో నష్టాల్లో కదలాడాయి.
గత వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 60.52 పాయింట్ల్లు పడిపోగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 41.95 పాయింట్లు దిగజారింది. ఫలితంగా వరుసగా నాలుగు వారాలు లాభాల్లో నడిచిన సూచీల జోరుకు బ్రేక్ పడినట్లైంది. అయతే ఈ వారం శుభారంభం కలగడంతో మళ్లీ లాభాలు రావచ్చన్న అంచనాలను మార్కెట్ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.