అక్షర

సరికొత్తగా కాగితపు పడవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరికొత్తగా కాగితపు పడవలు
డి.రామలింగం కథలు
వెల: రూ.70/-
ప్రతులకు: విశాలాంధ్ర బుక్‌హౌస్
ప్రజాశక్తి,నవ తెలంగాణా
బుక్‌హౌస్ బ్రాంచీలు
**
‘తెలంగాణా సాహిత్య వైభవాన్ని నేటి తరానికి అందించే ప్రయత్నంలో ‘డి.రామలింగం కథలు’ ఓ భాగం. తొలి తరంలో ప్రముఖ కథకుడిగా, బహు వ్యాసకర్తగా డి.రామలింగం నిలుస్తారు. ఆయన రాసిన కథలతో లోగడ వెలువడిన ‘కాగితపు పడవలు’ సంకలనాన్ని ప్రస్తుతం ‘డి.రామలింగం కథలు’ పేరిట ప్రచురిస్తున్నాం’ - అని ఈ పుస్తక ప్రచురణకర్తలు తెలిపారు.
‘డి.రామలింగం కథలు’ పేరిట వెలువడిన ఈ సంపుటిలో 10 కథలున్నాయి. ఇవన్నీ అప్పట్లో వివిధ పత్రికలలో ప్రచురింపబడినవే.
యూనివర్సిటీ చదువు పూర్తి చేస్తున్న విద్యార్థిలో అంకురిస్తున్న ప్రేమ, ‘కాగితపు పడవలు’ కథలోని ఇతివృత్తం. విద్యార్థి మనోభావాలను చూచాయగా వెల్లడిస్తూ కథను కొనసాగించిన విధానం బాగుంది.
‘కబుర్లలో కత్తిగాట్లు’ కథలో సున్నితమైన హాస్యం గోచరిస్తుంది. డెబ్బయి సంవత్సరాల కిందటి గ్రామీణ జీవితంలోని ఒక పార్శ్వాన్ని ఈ కథ ఎత్తి చూపుతుంది.
యుక్త వయస్సులో యువతీ యువకులలో కలిగే స్పందనలనూ, మనోభావాలనూ, రచయిత పలుచోట్ల ఈ కథలలో ప్రస్తావించారు. తక్కువ పదాలతో, ఎక్కువ భావాన్ని ఒలికించటం గమనించదగ్గది.
మనుషుల స్వభావానికి, మాట తీరుకు, నైతిక విలువలకూ రచయిత ఇచ్చే ప్రాధాన్యాన్ని ఈ కథలు వెల్లడిస్తాయి. పైగా ఆయా అంశాల గురించి, పాఠకుడిని కాసేపు ఆలోచించేటట్లు చేస్తాయి.
‘బర్సాతీ’ కథకు నేపథ్యంలో ఢిల్లీ ఉన్నట్లే, ‘అత్తా అల్లుడు’ కథలో 1950 నాటి బెజవాడ (ఇప్పటి విజయవాడ) కనిపిస్తుంది.

**
సమీక్ష కొరకు పుస్తకాలు పంపగోరువారు రెండు ప్రతులను తప్పనిసరిగా పంపాలి. చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్డు, సికిందరాబాద్-500 003.

-మార్తి వెంకటేశ్వర శాస్ర్తీ