ఆంధ్రప్రదేశ్‌

శివాజీ పునర్నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 10: గతంలో హైకోర్టు ఆదేశాలతో నిలిచిపోయిన ఏపి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ నియామక సమస్య ఎట్టకేలకు పరిష్కారమయింది. గత ఏప్రిల్ 26న చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన కారెం శివాజీ నియామకం నిబంధనల ప్రకారం జరగలేదని, ముందుగా నోటిఫికేషన్ ఇవ్వలేదంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన క్రమంలో.. అన్ని నిబంధనలు పూర్తి చేసి తిరిగి నియామక ప్రక్రియ చేపట్టాలని, అప్పటివరకూ ఆయన నియామకం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గతానుభవాలు, సాంకేతిక వ్యవహారాల ప్రక్రియను పూర్తి చేసి, తిరిగి కారెం శివాజీకే చైర్మన్ పదవి ఇస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈసారి అందులో సివేరి సోమ, డాక్టర్ కర్రా రాజారావు, రవీంద్ర, కె.నరహరి వరప్రసాద్, ఎన్.సుధారాణిని సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. దీనితో మాలమహానాడు నేత కారెం శివాజీకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టయింది. అదే సమయంలో కావాలనే నిబంధనలు పాటించకుండా శివాజీని బలిపశువును చేశారన్న విమర్శలకూ సమాధానం ఇచ్చినట్టయింది.

చిత్రం.. కారెం శివాజీ