సంపాదకీయం

న్యాయమూర్తి నిర్వాకం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలకత్తా ఉన్నత న్యాయమూర్తి చిన్నస్వామి స్వామినాథన్ కర్ణన్ అనుచిత ప్రవర్తన కొనసాగుతుండడం ఆశ్చర్యకరం కాదు. ఏడాదికి పైగా న్యాయమూర్తి కర్ణన్ దుందుడుకుతనం ప్రదర్శిస్తున్నాడు, బహిరంగంగా సర్వోన్నత న్యాయస్థానం-సుప్రీం కోర్ట్-పై తిరుగుబాటు చేస్తున్నాడు. సహచర ఉన్నత న్యాయమూర్తుల-హైకోర్ట్ జడ్జెస్-నే కాక సర్వోన్నత న్యాయమూర్తులను, చివరికి భారత ప్రధాన న్యాయమూర్తిని కూడ కర్ణన్ ఏడాదికిపైగా నిందిస్తుండడంతో దేశ ప్రజలు ఇదివరకే దిగ్భ్రాంతికి గురి అయి ఉన్నారు! న్యాయమూర్తులను మాత్రమే కాదు మాతృదేశాన్ని సైతం దూషించడం ఈ న్యాయమూర్తి దుర్మార్గానికి పరాకాష్ఠ. సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా నేరాభియోగాన్ని నమోదు చేయాలని మార్చి పదవ తేదీన కర్ణన్ పోలీసులను ఆదేశించడం ఆయన అనుచిత ప్రవర్తనను ఎఱగి ఉన్నవారికి ఆశ్చర్యం కలిగించడం లేదు! ఇలా నెలల తరబడి సుప్రీంకోర్టును నిందించగలుగుతున్న ఒక హైకోర్టు న్యాయమూర్తిని తక్షణం నిరోధించగల నిబంధనలు న్యాయ వ్యవస్థలో కాని, రాజ్యాంగంలో కాని లేకపోవడం మాత్రమే విస్మయకరం. అవినీతిపరులైన అసమర్ధులైన ఉన్నత న్యాయమూర్తులను పార్లమెంటు అభిశంసించినప్పుడు మాత్రమే వారిని పదవుల నుంచి తొలగించగలరు. రాజ్యాంగంలోని రెండు వందల పదిహేడవ అధికరణం ఇలా నిర్దేశిస్తోంది. పార్లమెంటు ఉభయసభలు విడివిడిగా మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతుతో అభిశంసన తీర్మానాన్ని ఆమోదించినపుడు మాత్రమే రాష్టప్రతి ఆయా న్యాయమూర్తులను పదవుల నుంచి తొలగించగలడు. ఇలా జటిలమైన సుదీర్ఘ ప్ర క్రియ ద్వారా అసమర్ధతకు గురైన అవినీతి పరులైన ఉన్నత న్యాయమూర్తులను పదవినుంచి తొలగించడం మినహా రాష్టప్రతి కాని సర్వోన్నత న్యా యస్థానం కాని అభియోగగ్రస్తులైన ఉన్నత న్యా యమూర్తులకు వ్యతిరేకంగా తీసుకోదగిన మరో చర్యను రాజ్యాంగం నిర్దేశించడం లేదు! ఈ సుదీర్ఘ ప్రక్రియ కొనసాగినంత కాలం అభియోగగ్రస్తులను తాత్కాలికంగా పదవుల నుంచి తొలగించడానికి-సస్పెన్షన్- రాజ్యాంగంలో ఎలాంటి నిబంధన కూడ లేదు. అలాంటి వారికి న్యాయ నిర్ణయ విధులను న్యాయపాలన విధులను కేటాయించరాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశించడం ఒక్కటే మధ్యంతర చర్య.
ఈ చర్యకు గురైన ఉన్నత న్యాయమూర్తులు విధులను నిర్వర్తించకుండానే వేతనాలను పొందడానికి వీలుంది! ఉన్నత న్యాయమూర్తులు పిడి దినకరన్, సౌమిత్ర సేన్ వంటివారు పార్లమెంటు అభిశంసన తప్పదని తేలిన తరువాత మాత్రమే తమ పదవులకు రాజీనామా చేయడం చరిత్ర! ఈ పరిణామాల తరువాతనైనా ఆక్రమాలకు పాల్పడే హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను అభిశంసన ప్రక్రియ సమయంలోను, అభియోగాలకు వౌలిక ఆధారాలు ఉంటే అభిశంసన ప్రక్రియ మొదలు కాక ముందు తాత్కాలికంగా పదవులనుండి తొలగించడానికి వీలు కల్పించే రాజ్యాంగ నిబంధన ఏర్పడలేదు. ఇదీ వైపరీత్యం.. న్యాయమూర్తి కర్ణన్ అవినీతికి పాల్పడినట్టు ఆరోపణకు గురి కాలేదు. ఆయనపై కొనసాగుతున్న అభియోగం విధి నిర్వహణలో అసమర్ధతకు సైతం సంబంధించినది కాదు. ఆయన న్యాయ ధిక్కారానికి పాల్పడినట్టు నమోదైన అభియోగాన్ని సర్వోన్నత న్యాయస్థానం విచారిస్తోంది! అందువల్ల న్యాయ ధిక్కార నేరం ఋజువై కర్ణన్‌కు సుప్రీంకోర్టు కారాగృహ నిర్బంధ శిక్షను విధించినట్టయితే తరువాత ఏమవుతుంది? శిక్ష పడిన వెంటనే కర్ణన్ తన పదవిని కోల్పోతాడా? లేక శిక్షాకాలం పూర్తయిన తరువాత ఆయన మళ్లీ పదవిలో కొనసాగుతాడా? ఎందుకంటే పార్లమెంటు అభిశంసించిన తరువాత మాత్రమే ఉన్నత న్యాయమూర్తులను పదవి నుంచి తొలగించడానికి వీలుంది! న్యాయ ధిక్కారం చేసిన ఉన్నత న్యాయమూర్తులను 217వ అధికరణం కింద అభిశంసన ద్వారా తొలగించడానికి వీలుందా? అన్నది మరో ప్రశ్న. ఈ ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయమే సమాధానం కాగలదు.
కర్ణన్‌కు వ్యతిరేకంగా న్యాయ ధిక్కార అభియోగాన్ని విచారిస్తున్న సర్వోన్నత న్యాయస్థానం ధర్మాసనం వారు ఆయన పిబ్రవరి పదమూడవ తేదీన తమ ఎదుట హాజరు కావాలని నిర్దేశించారు! కానీ కర్ణన్ హాజరు కాలేదు, హాజరు కాకపోవడానికి తగిన కారణాన్ని కూడ తెలుపలేదు! ఇది మరో న్యాయ ధిక్కారం. ఇలాంటి నేరాలకు పాల్పడే సాధారణ నేరస్థులను శిక్షించవలసిన కర్ణన్ వంటి ఉన్నత న్యాయమూర్తి స్వయంగా అదే నేరానికి ఒడిగట్టాడు.. అభూత పూర్వమైన, విస్మయకరమైన విచిత్రం ఇది! కర్ణన్ హాజరు కాకపోవడంతో ఆయనను నిర్బంధించవలసిందిగా పశ్చిమ బెంగాల్ పోలీస్ డైరక్టర్ జనరల్‌ను సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జెఎస్ కేహర్, న్యాయమూర్తులు మిశ్రా, జె.చలమేశ్వర్, రంజన గగోయి, మదన్ లోకుర, పి.సి.ఘోష్, కురియన్ జోసెఫ్ మార్చి పదవ తేదీన ఆదేశించారు. నిర్బంధించిన తరువాత పదివేల రూపాయల పూచీపై న్యాయమూర్తి కర్ణన్‌ను వదిలిపెట్టాలని కూడ సర్వోన్నత న్యాయస్థానం సప్తసభ్య ధర్మాసనం ఆదేశించింది. మార్చి ము ప్పయి ఒకటవ తేదీన న్యాయమూర్తి కర్ణన్ తనంత తానుగా సు ప్రీంకోర్టులో తప్పక హాజరు కావాలని ధ ర్మాసనం నిర్దేశించింది! అ లా హాజరు కాని ప క్షంలో కర్ణన్‌ను నిర్బంధించి కోర్టులో హాజరు పరచవలసిందిగా స ర్వోన్నత న్యాయమూర్తులు పోలీసులను ఆ దేశించనున్నారట! సు ప్రీంకోర్టు కర్ణన్ పట్ల ఇలా ఉదారంగా వ్యవహరిస్తోంది. ఆయనకు తగినంత సమయం ఇచ్చింది. కానీ సుప్రీంకోర్టుకు తనను విచారించే అధికారం లేదని కర్ణన్ విచిత్ర వాదం వినిపిస్తున్నాడు. తనను నిర్బంధించమని ఆదేశించిన ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు దళితుడైన తనకు వ్యతిరేకంగా నేరం చేశారని కర్ణన్ కలకత్తాలోని తన నివాసంలో ‘నిర్వహించిన’ ‘న్యాయ ప్రక్రియ’లో ఆరోపించాడు. ఈ ఏడుగురిపై ‘అనుసూచిత కులాల, అనుసూచిత సముదాయాల-కు వ్యతిరేకంగా జరిగే దౌర్జన్యకాండ నిరోధక చట్టం’ ప్రకారం అభియోగాలను దాఖలు చేయాలని కర్ణన్ పోలీసులను ఆదేశించాడు! సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా హైకోర్టు న్యాయమూర్తి ఇలా ‘నిర్ణయించడం’ ఏమిటి?
మదరాసు హైకోర్టు న్యాయమూర్తిగా ఉండిన కర్ణన్‌ను కలకత్తాకు బదిలీ చేయడంతో గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను దుయ్యబడుతున్నాడు. ఇలా దుయ్యబట్టడం న్యాయ ధిక్కార నేరం. సుప్రీంకోర్టు తనను బదిలీ చేస్తూ జారీ చేసిన ఉత్తరువు అమలు జరగకుండా కర్ణన్ ‘తాత్కాలికంగా నిలిపివేశాడు’ కూడ! సుప్రీంకోర్టు ఆదేశాన్ని హైకోర్టు నిలిపివేయడం,. రద్దు చేయడం అభూత పూర్వమైన విచిత్రం.. ఆ తరువాత కర్ణన్ కలకత్తాకెళ్లి విధులను స్వీకరించాడు! ఈ దేశంలో పుట్టడం తన దౌర్భాగ్యమని గత ఏడాది కర్ణన్ వ్యాఖ్యానించాడు కూడ...