బిజినెస్

జియోకి దీటుగా బిఎస్‌ఎన్‌ఎల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 16: మార్కెట్‌లో పెను సంచలనాలు సృష్టిస్తూ దూసుకెళ్తున్న రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు ప్రభుత్వ రంగ టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ (్భరత సంచార్ నిగమ్ లిమిటెడ్) గురువారం సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద 339 రూపాయల ధరతో వినియోగదారులకు తమ సొంత నెట్‌వర్క్‌లో అపరిమిత కాలింగ్ సదుపాయంతో పాటు రోజుకు 2 జిబి చొప్పున 28 రోజుల పాటు 3జీ డేటాను అందజేయనుంది. వినియోగదారులు 339 రూపాయల కాంబో ఎస్‌టివి (స్పెషల్ టారిఫ్ ఓచర్)తో రీచార్జి చేసుకుని పైన పేర్కొన్న సదుపాయలను పొందవచ్చని, ఈ ఆఫర్ 90 రోజులకు మాత్రమే పరిమితమని బిఎస్‌ఎన్‌ఎల్ గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. దేశీయ టెలికామ్ మార్కెట్లోకి గత ఏడాది కొత్తగా ప్రవేశించిన రిలయన్స్ జియో సంస్థ తమ ఖాతాదారులకు ఈ నెల 31వ తేదీ వరకు అన్ని నెట్‌వర్క్‌లకు ఉచితంగా అపరిమిత కాలింగ్ సదుపాయాన్ని కల్పించడంతో పాటు రోజుకు 1 జిబి చొప్పున హైస్పీడ్ 4జీ డేటాను అందజేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతమున్న చందాదారులతో పాటు ఈ నెల 31వ తేదీలోగా తమ నెట్‌వర్క్‌లో చేరే కొత్త ఖాతాదారులు వన్‌టైమ్ ఫీజు కింద 99 రూపాయలతో పాటు నెలకు 303 రూపాయల చొప్పున చెల్లించడం ద్వారా ఈ ప్రయోజనాలను మరో ఏడాది పాటు (వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు) పొందవచ్చని రిలయన్స్ జియో గత నెలలో ప్రకటించింది. అయితే రోజుకు 2జిబి డేటాతో తాము తాజాగా ప్రవేశపెట్టిన కొత్త పథకం దేశీయ టెలికామ్ పరిశ్రమలోనే అత్యుత్తమమైనదని, ఎంతో విధేయులైన తమ మొబైల్ ఖాతాదారులకు చౌకధరలో సమర్ధవంతమైన సేవలను అందించేందుకు కట్టుబడి ఉన్నామని బిఎస్‌ఎన్‌ఎల్ స్పష్టం చేసింది.