బిజినెస్

మార్కెట్లకు కొనుగోళ్ల జోష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 16: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యంగా యుపిలో మిజెపి ఘనవిజయం తర్వాత ఊపు మీద ఉన్న దేశీయ స్టాక్ మార్కెట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు పెంపు ప్రభావాన్ని సైతం బేఖాతరు చేస్తూ గురువారం భారీ లాభాలతో ముగిశాయి. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ సెనె్సక్స్ 188 పాయింట్లు పెరిగి దాదాపు రెండేళ్ల గరిష్ఠ స్థాయి అయిన 29,586 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం సరికొత్త రికార్డు అయిన 9,154 పాయింట్ల స్థాయికి చేరుకుంది. అందరూ ఊహించినట్లుగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును పావు శాతం పెంచినప్పటికీ భవిష్యత్తులో పెంపుపై తొందరపడబోమని చెప్పడమే కాకుండా దేశ ఆర్థిక పరిస్థితిపై సానుకూల దృశ్యాన్ని ఆవిష్కరించడం మార్కెట్ వర్గాలకు ఊతమిచ్చింది. ఫలితంగా బిఎస్‌ఇ సెనె్సక్స్ ప్రారంభంనుంచి కూడా లాభాల బాటలోనే సాగింది. చివరికి 187.74 పాయింట్ల లాభంతో 29,585.85 పాయింట్ల వద్ద ముగిసింది. 2015 జనవరి 29 తర్వాత సెనె్సక్స్ ఇంత గరిష్ఠస్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి. బుధవారం సెనె్సక్స్ స్వల్ప నష్టాలతో ముగిసిన విషయం తెలిసిందే.విదేశీ పెట్టుబడుల రాకడ కొనసాగుతుండడంతో రూపాయి సైతం మరింత బలపడి 16 నెలల గరిష్ఠస్థాయికి చేరుకుని డాలరుతో 65.41 రూపాయల స్థాయికి చేరుకుంది. కొనుగోళ్ల జోరు ఎంతగా ఉందంటే అన్ని రంగాలకు చెందిన షేర్లు లాభాలతో ముగిశాయి. రిటైల్ ఇనె్వస్టర్లు మిడ్‌క్యాప్ షేర్ల కొనుగోలుపట్ల ఆసక్తి చూపించడంతో అవి మంచి లాభాలు ఆర్జించాయి. విదేశీ ఇనె్వస్టర్లు దాదాపు అన్ని రంగాలకు చెందిన షేర్లలోను కొనుగోళ్లు జరిపాయి. ఫలితంగా అదానీ పోర్ట్స్ షేరు 4.73 శాతం పెరిగింది. బ్రిటన్‌లో వ్యాపారం విలీనంపై మేలో ఒక నిర్ణయం తీసుకుంటుందన్న వార్తలతో టాటా స్టీల్ కంపెనీ షేరు 4.30 శాతం పెరిగింది. బజాజ్ ఆటో, ఏసియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, హెచ్‌డిఎఫ్‌సి షేర్లు కూడా మంచి లాభాలు ఆర్జించాయి. అయితే హీరో మోటోకార్ప్, భారతీ ఎయిర్‌టెల్, రిల్, కోల్ ఇండియా షేర్లు నష్టపోయాయి. ఆసియా మార్కెట్లలో చైనా, హాంకాంగ్, జపాన్ మార్కెట్ల ప్రధాన సూచీలు పెరిగాయి. ఐరోపా మార్కెట్లు సైతం ప్రారంభంలోనే లాభాల్లో మొదలైనాయి.