అక్షర

కథకుల పరిచయ కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తెలంగాణ కథకుల
కథాంతరంగం’
వెల: రు.100/-
పేజీలు: 95
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
**

ఒక కథకుడినో, ఒక కథా సంపుటినో విశే్లషిస్తూ వ్యాస సంకలనాలు రావడం మామూలే. అలా కాకుండా ఒక కథను ఎంపిక చేసుకుని ఆ కథను విశే్లషించడం ద్వారా, ఆ కథకుడి గొప్పదనాన్ని వివరించే ప్రయత్నాలు కూడా జరిగాయి. జరుగుతున్నాయి. ఈ ప్రణాళికతో మొదట కోడూరి శ్రీరామమూర్తి ‘ఆంధ్రభూమి’ ‘ఈనాడు’లో ఎంపిక చేసుకున్న కథకుల ఒక్కొక్క కథను తీసుకుని వాటిని పరిచయ వ్యాసాలుగా రాశారు. ఇందులో గురజాడ మొదలుకుని పాటిబండ్ల రజని వరకు ఎందరో కథకులను పరిచయం చేశారు. అలాగే చదవాల్సిన వంద కథానికలు పేరిట వేదగిరి రాంబాబు ఒక్కో కథకుడు రాసిన ఒక్కో కథను తీసుకుని ఒక దినపత్రికలో రాస్తున్నారు. ఈ ప్రణాళికకు భిన్నంగా ఎ.కె.ప్రభాకర్ తనకు నచ్చిన కథను తీసుకుని, దాన్ని పూర్తిగా విశే్లషిస్తూ సారంగ వెబ్ మాగజైన్‌లో సీరియల్‌గా రాశారు. ఇక్కడ కథకులకు ప్రాధాన్యం లేదు. పాతవారయినా, కొత్తవారయినా సంబంధం లేదు. వారు చదివిన కథలలో నుండి వారికి బాగా నచ్చిన కథను తీసుకుని దాన్ని విశే్లషించడం కనిపిస్తుంది. నిడివి విషయంలో ఎలాంటి నిబంధనలు లేకపోవడం వలన వారు పూర్తిస్థాయిలో విమర్శా వ్యాసాలను రాయగలిగారు. వాళ్లందరికంటే భిన్నంగా ఒక ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా తెలంగాణ కథకుల వరకే పరిమితమై, వారి గొప్పదనాన్ని వివరించే ఒక కథను తీసుకుని విశే్లషించడం గోపగాని రవీందర్ ‘తెలంగాణ కథకుల కథాంతరంగం’లో కనిపిస్తుంది. ఈ వ్యాసాలు ఆకాశవాణి ప్రసంగ వ్యాసాలుగా వెలువడడం వలన సమయాన్ని దృష్టిలో ఉంచుకుని తమకు తాముగా కొన్ని పరిమితులు విధించుకుని, ఆ పరిమితులలో రాసిన వ్యాసాలివి. ఇందులో కాళోజీ మొదలుకుని స్కైబాబా వరకు వున్న కథకులు ఇందులో చోటు చేసుకోగలిగారు. ఇంకా చాలామంది ఉన్నప్పటికీ ఇరవై వ్యాసాలుగా కుదించుకోవడం వలన ఇరవై మంది మీదనే రాయగలిగారు. కోడూరు శ్రీరామమూర్తి, వేదగిరి రాంబాబులకు స్థల పరిమితులు, గోపగాని రవీందర్‌కు కాలం విధించిన పరిమితులు ఉండడం వల్ల, వారి వ్యాసాలు విమర్శా వ్యాసాలుగా కాకుండా పరిచయ వ్యాసాలుగానే తయారయ్యాయి. ఈ కథలు రచయిత వైయక్తిక అభిరుచుల మేరకు ఎంపిక చేసుకున్నవి. అంతే తప్ప ఇవే ఆయా రచయితల గొప్ప కథలని భావించనవసరం లేదు. అంతేకాదు, ఈ ఒక్క కథ ఆధారంగా ఆయా రచయితలు గొప్ప రచయితలని నిర్ధారించడానికి కూడా వీలు లేదు. మొత్తం కథలను విశే్లషిస్తే తప్ప ఆయా రచయితల దృక్పథం ఏమిటో, అతని ఆలోచనా ధోరణి ఏమిటో తెలుస్తుంది. అయినప్పటికీ ఈ పరిచయ వ్యాసాల ద్వారా లీలామాత్రంగా ఆ రచయిత గొప్పదనాన్ని తెలుసుకోవచ్చు. ఇవి చదివి ప్రభావితులైన పాఠకులు ఆయా రచయితల సమగ్ర సంకలనాలను చదవడం వైపు ఆసక్తి చూపగలుగుతారు. ఆకాశవాణి ఆదిలాబాదు ప్రసంగ వ్యాసాలను గాలికి పోకుండా, ఇలా పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయం.

-కె.పి.అశోక్‌కుమార్