బిజినెస్

‘ముద్రణ రంగాన్ని పరిశ్రమగా గుర్తించండి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: ప్రింటింగ్ రంగాన్ని ప్రభుత్వం పరిశ్రమగా గుర్తించి విద్యుత్ రాయితీ కల్పించాలని అఖిల భారత మాస్టర్ ప్రింటర్ల సమాఖ్య (ఎఐఎఫ్‌ఎంపి) డిమాండ్ చేసింది. 235వ అఖిల భారత గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలు శనివారం ఇక్కడ ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో దేశవ్యాప్తంగా మారుతున్న నూతన సాంకేతికతకు అనుగుణంగా ముద్రణ రంగం సాధిస్తున్న విజయాలను గుర్తుచేసుకుంటా మని ఎఐఎఫ్‌ఎంపి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కమల్ చోప్రా తెలిపారు. ఈ సమావేశానికి 200 మంది నిపుణలు వివిధ ప్రాంతాల నుండి హాజరయ్యారన్నారు. సమావేశాల్లో తెలంగాణ ఆఫ్‌సెట్ ప్రింటర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవీందర్ రెడ్డి, కృష్ణారెడ్డి, సమాఖ్య జాతీయ గౌరవ కార్యదర్శి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.