ఆంధ్రప్రదేశ్‌

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మార్చి 24: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలపై క్షేత్ర స్థాయిలో అధ్యాయనం చేసేందుకు ఓ ప్రత్యేక కమిటీ ఏర్పడింది. పోలీసుశాఖకు చెందిన డిఎస్పీ స్థాయి అధికారులతోపాటు రవాణా, ఆర్ అండ్ బి, నేషనల్ హైవే అధారిటీ, తదితర ప్రభుత్వ శాఖల అధికారులతో కూడిన ఈ కమిటీ జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో పని చేస్తుంది. ఈమేరకు రాష్ట్ర డిజిపి నండూరి సాంబశివరావు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు, కూడళ్ళు గుర్తించి ‘యాక్సిడెంట్ మ్యాపింగ్’ చేయాల్సిందిగా సూచించారు. అదేవిధంగా విధుల్లో ఉత్తమ సేవా ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఫిబ్రవరి మాసానికిగాను ‘ఇంప్రెసివ్ పబ్లిక్ సర్వీస్’ (ఐపిఎస్-17) అవార్డులు అందచేశారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఆయన రాష్ట్రంలోని అన్ని జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసుశాఖలోని డిఎస్పీలతోపాటు ట్రాన్స్‌పోర్టు, ఆర్ అండ్ బి, నేషనల్ హైవే శాఖలకు చెందిన అధికారులతో జిల్లా ఎస్పీ పర్యవేణలో ఏర్పాటైన కమిటీలు ఆయా జిల్లాల్లోని ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలు, కూడళ్ళు అదేవిధంగా ఒకే ప్రమాదంలో ఎక్కువ మంది మరణించిన ప్రదేశాలు పరిశీలించి, ప్రమాదాలకు కారణాలను కచ్చితంగా అంచనా వేయాల్సిందిగా ఆదేశించారు. ఒక నెల వ్యవధిలో రోడ్డు ప్రమాదాలపై ఆయా జిల్లాల్లో ప్రమాదం జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను ఆ ప్రదేశం అక్షాంశాలు, రేఖాంశాలు అధారంగా జిల్లా యాక్సిడెంట్ మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. రహదారుల భద్రత, ప్రమాదాల నివారణను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత గల అంశంగా పరిగణిస్తుందని డిజిపి వివరించారు. ప్రమాదాల నివారణకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. సమీక్షా సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్, అన్ని జిల్లాల ఎస్పీలు, రేంజ్ డిఐజిలు, ఐజిలు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని జిల్లాల వారీగా పలువురు అధికారులు, సిబ్బందికి డిజిపి ‘ఇంప్రెసివ్ పబ్లిక్ సర్వీస్’ అవార్డులు అందచేశారు. ఇటీవల పెనుగంచిప్రోలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులను తక్షణం ఆస్పత్రికి తరలించి వారి ప్రాణాలను కాపాడటంలో చురుకుగా పని చేసి అనేకమంది ప్రాణాలు కాపాడిన కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు పోలీస్టేషన్ కానిస్టేబుల్ డి కిరణ్‌ను అభినందించిన ప్రథమ బహుమతి అందచేశారు. అదేవిధంగా గోదావరి నదిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను కాపాడి ఆమెలో అత్మస్థైర్యాన్ని నింపిన రాజమండ్రి షీటీమ్స్‌లోని ఉమెన్ ఎఎస్‌ఐ ఎం వెంకటరమణమ్మ, మహిళా హెడ్ కానిస్టేబుల్ జి శ్రీదేవి, మహిళా కానిస్టేబుల్ ఎం నాగలక్ష్మీలకు ద్వితీయ బహుమతి అందచేశారు. ఇక విశాఖపట్నంలో వరుస చోరీలకు పాల్పడుతున్న నేరస్తురాలిని పట్టుకుని 47కేసులను ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన విశాఖపట్నం కంచరపాలెం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఎస్ హరిప్రసాద్‌కు ద్వితీయ బహుమతి అందజేసారు.