ఆంధ్రప్రదేశ్‌

జప్తయిన ఆస్తుల్లో మంత్రి భూముల్లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మార్చి 25: జప్తు చేసిన అగ్రిగోల్డ్ ఆస్తులకు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొనుగోలు చేసిన భూములకు సంబంధం లేదని సిఐడి తేల్చి చెప్పింది. అదేవిధంగా వైసిపి నేత పి గౌతంరెడ్డి ఆస్తులకు కూడా ఇప్పటివరకు సంబంధం లేదని సిబిసిఐడి అదనపు డిజి ద్వారకా తిరుమలరావు చెప్పారు. పూర్తిగా హైకోర్టు పర్యవేక్షణలోనే విచారణ చేస్తున్నామన్నారు. ఇదిలావుండగా సహరా కేసు తరహాలో అతి పెద్దదైన అగ్రిగోల్డ్ కేసులో సిఐడి విచారణ అద్భుతమని, అతి తక్కువ వ్యవధిలోనే కోర్టు పర్యవేక్షణలో పురోగతి సాధించడంలో విశేష కృషి చేసిందని డిజిపి నండూరి సాంబశివరావు కితాబిచ్చారు. విజయవాడలోని డిజిపి క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం హోంమంత్రితో కలిసి నిర్వహించిన విలేఖరుల సమావేశంలో కేసుకు సంబంధించి ద్వారకా తిరుమలరావు వివరణ ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన తాజా జీఓతో కలిపి ఇప్పటివరకు కేసుకు సంబంధించి విడుదలైన అన్ని జిఓల ప్రకారం 21,709 ఎకరాలు, 86,555 చదరపుగజాల స్థలాలు గుర్తించి సీజ్ చేసినట్లు చెప్పారు. సబ్ రిజిస్ట్రార్ విలువ ప్రకారం సుమారు 2,500కోట్లు రూపాయలు విలువ ఉన్నట్లు అంచనా ఉందని, మార్కెట్ విలువ ఇంకా ఎక్కువే ఉంటుందన్నారు. బాధితులకు ఇప్పటికిప్పుడు న్యాయం చేసేందుకు సుమారు 16వేల కోట్ల రూపాయలు అవసరముంటుందన్నారు. ఇప్పటివరకు కేసులో 19మంది నిందితులను గుర్తించామని, ఏడుగురిని అరెస్టు చేశామని చెప్పారు. మిగిలిన 12మందిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఆస్తుల గుర్తింపు ప్రక్రియలో భాగంగా అరెస్టుల్లో జాప్యం జరిగిందని, అరెస్టయిన చైర్మన్ కం మేనేజింగ్ డైరెక్టర్ ఇప్పటికీ జైలులోనే ఉన్నాడని చెప్పారు. జప్తు చేసిన ఆస్తుల్లో మంత్రి పుల్లారావు కొనుగోలు చేసిన భూములు లేవని, కేసుకు ఆయనకు సంబంధం లేదన్నారు. గౌతంరెడ్డికి కూడా ఇప్పటివరకు ఎలాంటి ప్రమేయం లేదని, బినామీలు ఉన్నట్లు ఎవరికైనా సమాచారం ఉంటే తమకు తెలియచేయాలని కోరారు.