కృష్ణ

పన్నులు వసూలు చేస్తేనే అభివృద్ధి నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట, మార్చి 30: మున్సిపాలిటీల్లో నూరు శాతం పన్నుల వసూలు చేస్తేనే ప్రభుత్వం అభివృద్ధి నిధులు మంజూరు చేస్తుందని పన్నుల వసూళ్లకు ప్రతి ఒక్క సభ్యులు సహకరించాలని చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు కౌన్సిల్‌లో కోరారు. గురువారం జరిగిన కౌన్సిల్ అత్యవసర సమావేశంలో పట్టణంలో ఆస్తి పన్ను, నీటి పన్ను ఇంకా కోటిన్నర పైగా వసూలు కావాల్సి ఉందని వీటిని వసూలు చేయకపోతే ప్రభుత్వం అభివృద్ధి గ్రాంటు విడుదల చేయదని అన్నారు. ఫ్లోర్ లీడర్ యలమంచలి రాఘవ మాట్లాడుతూ గతంలో పన్నుల చెల్లించిన వారికి సంబంధించి జరిగిన అవకతవకలపై సొమ్ము కట్టిన వారిని నష్టపరచటం జరగదని వారికి వెలసుబాటు కల్పించాలని కోరారు. కమిషనర్ వెంకటేశ్వరరావు సమాధానం ఇస్తూ ఏప్రిల్ 30 లోపు గతంలో పన్నులు కట్టిన రసీదు వివరాలతో సహా అర్జీ దాఖలు చేసుకోవాలని డిఎంఎకు పంపి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు రూ. 7 కోట్లు మంజూరు కావాల్సి ఉండగా కేవలం రూ. 1.40 కోట్లు పనులు ప్రతిపాదించటంపై ఆరవ వార్డు సభ్యుడు ఇంటూరి చిన్న చేసిన వ్యాఖ్యలు అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. ఇంటూరి చిన్న మాట్లాడుతూ నిధులు కేటాయింపు ఎమ్మెల్యే కీలకంగా వ్యవహరించలేదని అందుకే నిధులు వెనక్కిపోయాయని దేశం పార్టీలోని వర్గ విబేధాలు మరోకారణమంటూ ఆరోపించారు. దీనిపై ఫ్లోర్ లీడర్ యలమంచిలి రాఘవరావు దీటుగా స్పందిస్తూ తెలుగుదేశం వర్గ విబేధాలు లేవని అది ఎదుటి వారి పార్టీలోనే ఉన్నాయని ఎమ్మెల్యే రాజగోపాల్, ఎమ్మెల్సీ జనార్థన్‌లు నియోజకవర్గ మున్సిపాలిటీ అభివృద్ధికి నిధుల కేటాయింపుకు కృషి చేస్తున్నారని వారి కృషి ఫలితమే పట్టణానికి రూ. 19 కోట్లు మంచినీటి పథకానికి మంజూరయ్యాయని అన్నారు.
విశ్వనాథంకు నివాళులు
కౌన్సిల్ సమావేశం ప్రారంభంలో జగ్గయ్యపేట తొలి సర్పంచ్‌గా పని చేసిన సామినేని విశ్వనాథంకు కౌన్సిల్‌లో నివాళులర్పించారు. చైర్మన్ తన్నీరు అధ్యక్షతన వారు పట్టణానికి చేసిన సేవలను సభ్యులు గుర్తు చేసుకుని వారికి నివాళులర్పించారు. ఇటీవల మృతి చెందిన ఫ్లోర్ లీడర్ యలమంచిలి రాఘవరావు తల్లి ఝాన్సీలక్ష్మి మృతికి కౌన్సిల్‌లో సంతాపం ప్రకటించారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ అక్బర్ తదితర కౌన్సిల్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
తోలుకోడుకు కృష్ణా జలాల విడుదల
మైలవరం, మార్చి 30: మండలంలోని తోలుకోడుకు ఎట్టకేలకు కృష్ణా జలాలు విడుదలయ్యాయి. మండల పరిషత్ ఉపాధ్యక్షుడు ఇనుగంటి శోభన్‌బాబు గురువారం కృష్ణానీటిని విడుదల చేశారు. గ్రామంలోని దళితవాడలో రెండు లక్షల రూపాయల వ్యయంతో పది వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకును, మాలపల్లిలో మరో మూడు లక్షల రూపాయల వ్యయంతో పది వేల లీటర్ల సామర్థ్యం కలిగిన మరో ట్యాంకును కొత్తగా నిర్మించారు. వీటికి ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా ట్యాంకులకు కలిపి నీటితో నింపగా నీటిని వైస్ ఎంపిపి శోభన్‌బాబు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మధుబాబు, సహకార సంఘాధ్యక్షులు పెదబాబు, గ్రామస్థులు పాల్గొన్నారు.