S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/24/2017 - 00:57

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు ఆదాయం 17 రెట్లు పెరిగింది. గత ఏడాది అక్టోబర్ ఒకటి నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ మధ్య కాలానికి ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన వినోద రంగంలోని వంద మంది భారత అత్యంత ధనికుల జాబితా ప్రకారం సింధు ఆదాయం 57.25 కోట్లకు చేరింది. అంతకు ముందు అదే కాలానికి సింధు ఆదాయంతో పోలిస్తే పదిహేడు రెట్లు పెరిగింది.

12/24/2017 - 00:55

ముంబయి, డిసెంబర్ 23: దక్షిణాఫ్రికాతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఆరు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో తలపడే భారత జట్టులో కేదార్ జాధవ్, శార్దూల్ ఠాకూర్ చోటు దక్కించుకున్నారు. సీనియర్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాకు సెలక్టర్లు మరోసారి మొండి చేయి చూపారు. విశ్రాంతి అనంతరం రెగ్గులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ జట్టుకు నాయకత్వం వహిస్తుండగా, అతనికి డిప్యూటీగా రోహిత్ శర్మ వ్యవహరిస్తాడు.

12/24/2017 - 00:53

భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) జనరల్ మేనేజర్‌గా నియమితుడైన భారత మాజీ వికెట్‌కీపర్ సాబా కరీం (ఫైల్ ఫొటో). మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ తీవ్రంగా పోటీపడినప్పటికీ, ఈ అవకాశాన్ని కరీం చేజిక్కించుకున్నాడు. అతను జనవరి ఒకటని బీసీసీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాహుల్ జోహ్రీకి రిపోర్ట్ చేస్తాడు.

12/24/2017 - 00:52

మెల్బోర్న్, డిసెంబర్ 23: తన సహచర ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఫిట్నెస్ అనుమానంగానే ఉందని ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ తెలిపాడు. కాలి మడమ బెణకడంతో బాధపడుతున్న స్టార్క్ పూర్తిగా కోలుకున్నట్టు కనిపించడం లేదన్నాడు. ఇంగ్లాండ్‌తో 26వ తేదీ నుంచి ప్రారంభమయ్యే యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో అతను ఆడే అవకాశాలు సగమే ఉన్నాయని తెలిపాడు.

12/24/2017 - 00:50

ముంబయి, డిసెంబర్ 23: భారత స్పిన్‌తో ఇబ్బంది పడుతున్నామని శ్రీలంక బ్యాట్స్‌మన్ కుశాల్ పెరెరా అంగీకరించాడు. శుక్రవారం జరిగిన రెండో టీ-20లో 77 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన అతను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌల్ చేస్తున్నారని కితాబునిచ్చాడు. వారు వేసే బంతులను ఎదర్కోవడం కష్టమవుతున్నదని చెప్పాడు.

12/24/2017 - 00:49

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: ఇటీవల జపాన్‌లో జరిగిన ఆసియా ఎయిర్‌గన్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టులో సభ్యుడు అర్జున్ సింగ్ చీమాను విమానం ఎక్కకుండా అధికారులు అడ్డుకున్నారు. అతని వద్ద ఉన్న మందుగుండు సామాగ్రికి క్లియరెన్స్ ఇవ్వలేమని పేర్కొంటూ వారు స్పష్టం చేశారు.

12/24/2017 - 00:48

ముంబయి, డిసెంబర్ 23: భారత్‌తో ఆదివారం చివరి టీ-20 ఇంటర్నేషనల్ ఆడాల్సిన శ్రీలంకకు మరో సమస్య ఎదురైంది. సీనియర్ ఆల్‌రౌండర్, కండరాల నొప్పితో బాధపడుతున్న మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్‌కు కనీసం రెండు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు తేల్చిచెప్పారు. దీనితో చివరి టీ-20లో అతను ఆడే అవకాశం లేదు.

12/24/2017 - 00:48

క్రైస్ట్‌చర్చి, డిసెంబర్ 23: ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ విజృంభించి, తన కెరీర్‌లోనే అత్యుత్తమ విశే్లషణను నమోదు చేయడంతో, వెస్టిండీస్‌తో శనివారం జరిగిన రెండో వనే్డలో న్యూజిలాండ్ 204 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో గెల్చుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఈ జట్టు 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 325 పరుగుల భారీ స్కోరు సాధించింది.

12/24/2017 - 00:47

లాసనే్న, డిసెంబర్ 23: జపాన్‌లోని టోక్యో నగరంలో వివిధ క్రీడా ప్రాంగణాలు, స్టేడియాల నిర్మాణ, ఆధునీకరణ, పునరుద్ధరణ పనులు సకాలంలోనే పూర్తవుతాయని, 2020 ఒలింపిక్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతాయని అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఓసీ) ఉపాధ్యక్షుడు, గేమ్స్ కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ జాన్ కోట్స్ ధీమా వ్యక్తం చేశాడు.

12/24/2017 - 00:47

లండన్, డిసెంబర్ 23: కామనె్వల్త్ గేమ్స్‌లో షూటింగ్ స్థానాన్ని క్రికెట్ ఆక్రమించనుందని సమాచారం. బర్మింగ్‌హామ్‌లో జరిగే 2022 కామనె్వల్త్ గేమ్స్ నుంచి షూటింగ్‌ను తప్పించి, దానికి బదులు టీ-20 లేదా టీ-10 ఫార్మాట్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టాలని తీర్మానించినట్టు పేరుచెప్పడానికి ఇష్టపడని కామనె్వల్త్ గేమ్స్ సమాఖ్య (సీజీఎఫ్) ఓ ఉన్నతాధికారి వెల్లడించాడు.

Pages