S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/27/2017 - 01:43

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: ఇషాంత్ శర్మ తన సామర్థ్యాన్ని తెలుసుకుని వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో జరిగే పోటీల్లో సత్తా నిరూపించుకోవాలని భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ సూచించాడు. దక్షిణాఫ్రికాలో పర్యటించే భారత జట్టుకు అయిదుగురు ‘పేస్’ మాంత్రికులు.. ఇషాంత్, ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రాలను ఎంపిక చేశారు.

12/27/2017 - 01:41

ఢిల్లీలోని ఆంధ్రా భవన్‌లో మంగళవారం షట్లర్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌లను సన్మానించిన అనంతరం వారితోపాటు ఏపీ భవన్ రిసిడెన్స్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ తదితరులు

12/27/2017 - 01:39

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: కొత్త ఏడాదిలో ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి పెట్టాల్సి ఉందంటున్నాడు ఫాంలోవున్న షట్లర్ కిడాంబి శ్రీకాంత్. ప్రపంచ షట్లర్స్‌లో మూడోస్థానంలో కొనసాగుతున్న తనుకు వచ్చే ఏడాది చాలా ముఖ్యమన్న భావన వ్యక్తం చేశాడు. ‘2017 ఆశాజనంగా సాగిపోయింది. వచ్చే ఏడాది గొప్పదిగానే కనిపిస్తోంది. ముఖ్యమైన టోర్నమెంట్లు వరుసగా ఉన్నాయి. వాటిలో విజయం సాధించాలంటే నేను మరింత ఫిట్‌నెస్ సాధించాలి.

12/27/2017 - 01:38

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: తగినంత సాధన ఉంటే బాడ్మింటన్ క్రీడలో ‘సర్వీస్’ అన్నది ఓ సమస్య కానే కాదని అంతర్జాతీయ షట్లర్ పీవీ సింధు తెలిపింది. బాడ్మింటన్‌లో కొత్త తరహా ‘సర్వీస్’ నిబంధన అమలు చేసేందుకు తగిన సమయం రావాలని ఆమె అంటోంది.

12/27/2017 - 01:35

మెల్బోర్న్, డిసెంబర్ 26: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో ఇక్కడ జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో తొలి రోజయిన మంగళవారం ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేయడం ద్వారా పటిష్ఠ స్థితిలో ఉంది. 99 పరుగుల వద్ద పెవిలియన్ దారి పట్టిన డ్యాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, చివరకు ఆ బంతి నో బాల్ అని రీప్లేలో తేలడంతో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టి శతకం పూర్తి చేసుకున్నాడు.

12/27/2017 - 01:32

క్రైస్ట్‌చర్చ్, డిసెంబర్ 26: వెస్టిండీస్‌తో జరిగిన వనే్డ సిరీస్‌ను న్యూజిలాండ్ క్లీన్ స్వీప్ చేసింది. మంగళవారం ఇక్కడ వెస్టిండీస్‌తో జరిగిన మూడవ, చివరి మ్యాచ్‌లో 66 పరుగుల ఆధిక్యంతో ఘన విజయం సాధించడం ద్వారా న్యూజిలాండ్ 3-0 ఆధిక్యంతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. మంగళవారం వర్షంతో అంతరాయం కలిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 131 పరుగులు చేసింది.

12/27/2017 - 01:04

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో జరిగే సిరీస్‌లో ప్రస్తుత భారత్ జట్టుకు విజయావకాశాలు మెండుగా ఉన్నాయని భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ అజింక్యా రహానే అంటున్నాడు. దక్షిణాఫ్రికాలో అతిథి (్భరత్) జట్టు రాణిస్తుందన్న విశ్వాసం తనకు బలంగా ఉందన్నాడు. ‘గెలిచే అవకాశాలు దండిగా ఉన్నాయి.. అయినప్పటికీ మెరుగైన ఆటను ప్రదర్శించేందుకు జట్టు సభ్యులంతా దృష్టి సారించాలి..

12/27/2017 - 01:03

హైదరాబాద్, డిసెంబర్ 26: యువతరం క్రీడల్లో రాణించాలంటే క్రీడా సంఘాల సంస్కృతిని బలోపేతం చేయాలని, ఆర్థికంగా మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించాల్సిన అవసరం ఉందని భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా అభిప్రాయపడ్డారు. యువతరం క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవాలంటే పెద్ద సవాలేనని వ్యాఖ్యానిస్తూ, అధ్లెట్‌కు సరైన ఆర్థిక ప్రోత్సాహం లభిస్తే క్రీడలను కెరీర్‌గా ఎంచుకుంటారని అభిప్రాయపడ్డారు.

12/26/2017 - 01:15

మెల్బోర్న్, డిసెంబర్ 25: ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌ను ఇప్పటికే ఆస్ట్రేలియా చేతికి అప్పగించిన ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మిగిలిన రెండు టెస్టుల్లో పరువు కోసం పోరాటం సాగించనుంది. జో రూట్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ మొదటి మూడు టెస్టుల్లో ఏమాత్రం ప్రతిఘటన ఇవ్వలేక, ఆస్ట్రేలియాకు దాసోహమన్నది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-3 తేడాతో చేజార్చుకుంది.

12/26/2017 - 01:13

మెల్బోర్న్, డిసెంబర్ 25: ఆస్ట్రేలియాతో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న నాలుగో యాషెస్ టెస్టులో ఇంగ్లాండ్ యువ పేసర్ టామ్ క్యూరన్‌కు చోటు లభించనుంది. మీడియం పేస్ ఆల్‌రౌండర్ క్రెగ్ ఒవర్టన్ పక్కటెముకలు చిట్లడంతో విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో, క్యూరన్‌కు ప్లేయింగ్ ఎలెవెన్‌లో స్థానం దక్కనుంది.

Pages