S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/18/2017 - 03:01

కీసర, సెప్టెంబర్ 17: మేడ్చల్ కలెక్టర్ ఎంవి రెడ్డి ఆదేశాల మేరకు ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్‌గౌడ్‌పై కేసు నమోదు చేసినట్లు కీసర సిఐ సురేందర్‌గౌడ్ తెలిపారు.

09/18/2017 - 02:59

హైదరాబాద్, సెప్టెంబర్ 17: ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని యధాతధంగా కొనసాగించాలని, సికింద్రాబాద్‌లోని బైసన్ పోలో గ్రౌండ్‌కు తరలించవద్దని టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న సచివాలయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించిన భవనాలు ఖాళీ అయిన తర్వాత తెలంగాణకు కావాల్సినంత వసతి సౌకర్యం ఏర్పడుతుందని ఆయన తెలిపారు.

09/18/2017 - 02:58

హైదరాబాద్, సెప్టెంబర్ 17: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం బంగారం స్మగ్లింగ్‌కు అడ్డాగా మారింది. ఈ విమానాశ్రయానికి ప్రతి నిత్యం విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కమిషన్ బేస్డ్‌తో కొందరు, సొంతంగా మరికొందరు బంగారాన్ని స్మగ్లింగ్ చేస్చూ పట్టుబడుతున్నారు. కాగా గత సంవత్సరం పది కేసులు నమోదు కాగా, ఈ యేడు డిఆర్‌ఐ అధికారులు 49 కేసులు నమోదు చేసి 20.8 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

09/18/2017 - 00:49

హైదరాబాద్, సెప్టెంబర్ 17: ఆధునిక విజ్ఞానాన్ని తెలంగాణ ప్రజా పంపిణీ వ్యవస్థ పూర్తిగా వినియోగించుకుంటోదని, దాంతో సత్ఫలితాలు వస్తున్నాయని పౌరసరఫరాల కమిషనర్ సి.వి. ఆనందర్ పేర్కొన్నారు.

09/18/2017 - 00:48

హైదరాబాద్, సెప్టెంబర్ 17: సాం ప్రదాయ బతుకమ్మ పాటలను వెలికితీసి రికార్డు చేయడం అభినందనీయమని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రగతి భవన్‌లో ఆదివారం తెలంగాణ జాగృతి సంస్థ బతుకమ్మ పాలు సేకరించి రూపొందించిన సిడీని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

09/17/2017 - 23:03

హుస్నాబాద్, సెప్టెంబర్ 17: సోనియగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే నేడు ముఖ్యమంత్రి కెసిఆర్ గడీల పాలన సాగిస్తుకులాల పేరుతో బీసీలను విడదీస్తు రాచరిక పాలన సాగిస్తున్నారని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.

09/17/2017 - 23:03

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: దేశ రాజధాని ఢిల్లీలోనూ తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సం బరాలను ఘనంగా నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభు త్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి అన్నారు. బతుకమ్మ సంబరాల నిర్వహణపై తెలంగాణ భవన్ అధికారులు, తెలుగు సంఘా లు, విద్యార్థులతో ఆయన ఆదివారం సమావేశమయ్యారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ సంబరాలకు పలువురు కేంద్ర మంత్రులను సైతం ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

09/17/2017 - 23:02

కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 17: రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ డేగకన్ను వేయబోతోంది. సవరణల్లో అక్రమాలు చోటుచేసుకోకుండా, గ్రామాల్లో రైతులకు అన్యాయం జరుగకుండా, వారిని అప్రమత్తం చేసేందుకు ఇందిరమ్మ రైతుబాట పేర గ్రామాలకు వెళ్ళేందుకు సిద్ధమవుతోంది.

09/17/2017 - 23:02

హైదరాబాద్, సెప్టెంబర్ 17: ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పేరుతో పుస్తకం రచించిన ప్రొఫెసర్ కంచె ఐలయ్యను సామాజిక ఉగ్రవాదిగా టిఆర్‌ఎస్ శాసనసభాపక్షం అభివర్ణించింది. ప్రతి ఒక్కరికీ భావ ప్రకటన స్వేచ్ఛను ప్రసాదించిన రాజ్యాంగం ఒక వ్యక్తిని కానీ, ఒక కులాన్ని కానీ, ఒక మతాన్ని కానీ కించపర్చే హక్కు ఎవరికీ ఇవ్వలేదని టిఆర్‌ఎస్ గుర్తు చేసింది.

09/17/2017 - 23:01

జనగామ టౌన్, సెప్టెంబర్ 17: సమాజంలో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా తన ప్రాణం ఉన్నంతవరకు రచనలు చేస్తూనే ఉంటానని ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు. హైదరాబాద్ నుండి హన్మకొండ వెళ్తూ ఆయన ఆదివారం మార్గమధ్యంలో జనగామ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో కాసే పు ముచ్చటించారు.

Pages