S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/26/2018 - 04:15

విజయవాడ (బెంజిసర్కిల్), జనవరి 25: పాలనలో, పారిశ్రామిక అభివృద్ధిలో టెక్నాలజీని విరివిగా వినియోగిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం భారతదేశంలో టెక్నాలజీ వినియోగంలో అగ్రగామిగా ఉందని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్టవ్య్రాప్తంగా ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తేవడంతో ఏపీ పల్లెల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు.

01/26/2018 - 04:13

విజయవాడ (బెంజిసర్కిల్), జనవరి 25: ఆంధ్రప్రదేశ్‌లో రియల్ టైం గవర్నెన్స్‌ను విరివిగా వినియోగించడం ద్వారా గణనీయమైన వృద్ధిని సాధించగలిగామని ఏపీ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయనున్న సందర్భంలో మీ సహకారం అందించాలని ఆయన హెచ్‌సి కంపెనీ ప్రెసిడెంట్ ఆనా పింజుక్‌ను కోరారు.

01/26/2018 - 04:13

విజయవాడ (కార్పొరేషన్), జనవరి 25: ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు సాధనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయంలో ముగ్గురు మోసగాళ్లు, ముగ్గురు ముద్దాయిలున్నారని ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. బీజేపీ ద్రోహం చేయగా టీడీపీ మోసం చేసిందని, వైసీపీ ప్రధాని మోదీ ముందు సాగిలపడి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాయని ఆయనన్నారు.

01/26/2018 - 04:12

గుంటూరు, జనవరి 25: నకిలీ సర్ట్ఫికెట్లతో వైద్యునిగా చలామణి అవటమే కాకుండా నిత్య పెళ్లికొడుకుగా పలువురు యువతలను వంచించిన ఓ ఘరానా ప్రబుద్ధుడి ఉదంతమిది. ప్రకాశం జిల్లా జె పంగలూరు మండలం మల్లవరం గ్రామానికి చెందిన చిలుకూరి వీరాంజనేయులు బీఎస్సీ డిగ్రీ పూర్తిచేసిన తరువాత ఇంకొల్లులోని ఐ కేర్ సెంటర్‌లో టెక్నీషియన్‌గా తొమ్మిదేళ్లు పనిచేశాడు. 2002లో అదే గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు.

01/26/2018 - 04:11

విజయవాడ (క్రైం), జనవరి 25: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన రాష్టప్రతి, పోలీసు పతకాలు దేశవ్యాప్తంగా 795 మంది పోలీసు అధికారులకు లభించగా.. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు అధిక సంఖ్యలో దక్కాయి. రాష్ట్రం నుంచి ఇద్దరు పోలీసు అధికారులకు ప్రెసిడెంట్ పోలీసు మెడల్స్ దక్కగా, మరో 14మందికి విశిష్ట సేవా పతకాలు లభించాయి.

01/26/2018 - 04:10

విజయవాడ, జనవరి 25: పరిమితికి మించి భూగర్భ జలాలు వెలికితీస్తుండటంతో 1227 గ్రామాల్లో భూగర్భ జలాల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. భూగర్భ జలమట్టం పెంచేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. చాలా ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు పెరుగుతున్నాయి. అయితే కొన్నిచోట్ల భూగర్భ జలాలను భారీగా వెలికితీస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది.

01/26/2018 - 03:31

అమరావతి, జనవరి 25: ‘హైదరాబాద్ రహేజా మైండ్ స్పేస్’ తరహాలో అమరావతి, విశాఖ, హిందూపురంలలో మైండ్ స్పేస్ భవనాలు నిర్మించాలని రహేజా మైండ్ స్పేస్ అధిపతి రవి రహేజాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటన 4వ రోజు గురువారం వరుసవారీగా ప్రపంచ ఆర్థిక వేదికలో పారిశ్రామికవేత్తలు, కంపెనీల ముఖ్య కార్యనిర్వహణాధికారులతో సమావేశాలు నిర్వహించారు.

01/26/2018 - 03:29

విజయవాడ, జనవరి 25: 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు చేసుకోని ఎన్నికల సరళిలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకుని భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచదేశాలకు చాటిచెప్పాలని కోరుతూ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ రాజ్‌భవన్ నుంచి టెలీ సందేశం ఇచ్చారు.

01/26/2018 - 03:28

ఓజిలి, జనవరి 25: వైసిపి అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గురువారం నెల్లూరు జిల్లా ఓజిలి మండలంలోని పునే్నపల్లి, నెమళ్లపూడి, కరబల్లవోలు, సగుటూరు గ్రామాల మీదుగా 20 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. అడుగుడుగునా ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

01/26/2018 - 03:26

గుంటూరు, జనవరి 25: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ తెర వెనుక మిస్టరీని గుంటూరు రూరల్ పోలీసులు ఛేదించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన అధికార తెలుగుదేశం పార్టీ నాయకుడి ప్రమేయంతో జిల్లాలోని పలు ఆసుపత్రుల్లో కిడ్నీ రాకెట్ దందా నడిచినట్లు తేలింది. ముఠాలోని నలుగురు సభ్యులను పోలీసులు అరెస్టు చేయగా మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారు.

Pages