S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/24/2018 - 23:25

అమరావతి, జనవరి 24: గత సంవత్సరం నిర్వహించిన లేపాక్షి ఉత్సవాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ సంవత్సరం వేడుకలు నిర్వహించాలని హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ సూచించారు. ఆ నాటి సాంస్కృతిక కార్యక్రమాలు పునరావృతం కారాదని, కొత్తదనం కనిపించాలని ఆకాక్షించారు. అందరినీ అలరించే విధంగా లేపాక్షి ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించాలన్నారు.

01/24/2018 - 23:24

న్యూఢిల్లీ, జనవరి 24: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ చిరంజీవి ఇటీవల ఇక్కడ భేటీ అయ్యారు. తన తాజా చిత్రం షూటింగ్ పూర్తయిన తరువాత ఏపీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటానని రాహుల్‌కు ఆయన చెప్పినట్టు తెలిసింది. 2019లో జరిగే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తానని కాంగ్రెస్ ఎంపీ వెల్లడించారు.

01/24/2018 - 23:23

విశాఖపట్నం, జనవరి 24: నవ్యాంధ్రను నాలెడ్జ్‌హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భవిష్యత్‌లో అత్యుత్తమ ఫలితాలు అందిస్తాయని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర పరిధిలో యూనివర్శిటీల విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు.

01/24/2018 - 23:23

ప్రొద్దుటూరు, జనవరి 24: కడప జిల్లాలో ఉక్క్ఫ్యుక్టరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మార్చ్ ఫర్ స్టీల్‌ప్లాంట్ పేర భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులు, ప్రజలు, ప్రచజా సంఘాల నాయకులు ఈ ర్యాలీలో పాల్గొని ఉక్కు సంకల్పాన్ని చాటారు.

01/24/2018 - 03:36

గుంటూరు, జనవరి 23: దళితులకు మీరేం చేశారో..మా ప్రభుత్వం ఏం చేసిందో బహిరంగ చర్చలో తేల్చుకుందాం..దమ్ముంటే రా!.. వేలాది ఎకరాల దళితుల భూములు కాజేసి వాస్తవాలను వక్రీకరిస్తావా.. ఖబడ్దార్..ఇకపై నీ ఆటలు సాగవని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు గిరిజన, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనంద్‌బాబు సవాల్ విసిరారు..

01/24/2018 - 03:35

రాజమహేంద్రవరం, జనవరి 23: రానున్న ఎన్నికల్లో మోదీని ప్రజలు తిరస్కరించకపోతే దేశానికి విపత్తేనని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. పెద్ద నోట్ల రద్దువల్ల దేశ జీడీపీ పెరిగిందని ప్రధాని మోదీ బలవంతంగా చెప్పిస్తున్నారని ఆర్థిక గణాంక శాస్తవ్రేత్త సుబ్రహ్మణ్యస్వామి చెప్పడాన్ని బట్టి చూస్తుంటే దేశానికి మోదీ చాలా ప్రమాదమనే విషయం తెలుస్తోందన్నారు.

01/24/2018 - 03:35

శ్రీకాకుళం, జనవరి 23: జిల్లాలోని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు కొత్తూరు ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ మంగళవారం నాన్-బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ)ని జారీ చేసారు.

01/24/2018 - 03:34

అనంతపురం, జనవరి 23: విభజన నేపథ్యంలో రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. హైకోర్టు సాధన కోసం సీమ జిల్లాల్లో న్యాయవాదులు ఉద్యమిస్తున్నారు. తమ ఆందోళనలను ఉధృతం చేయడంలో భాగంగా మంగళవారం నుంచి ఈనెల 25 వరకు మూడు రోజుల పాటు కోర్టు విధుల్ని బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మంగళవారం అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో విధుల బహిష్కరణ, ర్యాలీలు జరుగుతున్నాయి.

01/24/2018 - 03:33

విశాఖపట్నం, జనవరి 23: మత్స్యకారులనుల ఎస్సీ,ఎస్టీల మాదిరి ఎస్‌ఎఫ్ (షెడ్యూల్ ఫిషర్‌మెన్)గా గుర్తించాల్సిందేనని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. గత నెల రోజులుగా తమను మత్స్యకారులు ఎస్టీలుగా గుర్తించాలని చేస్తున్న ఉద్యమానికి ఆయన సంఘీభావం తెలిపారు. ఈ మేరకు మంగళవారం విశాఖలో పర్యటించిన ఆయన మత్స్యకారుల ఉద్యమంలో పాల్గొన్నారు.

01/24/2018 - 03:31

కర్నూలు, జనవరి 23: హైదరాబాద్‌లో మహిళా డిఎస్పీతో ఓ సీఐ వివాహేతర సంబంధం వ్యవహారం సద్దుమణగకముం దే కర్నూలులో అటవీశాఖ విజిలెన్స్ డీఎఫ్‌ఓ రాసలీలలు బయటపడ్డాయి. కర్నూలు జిల్లా అటవీశాఖ విజిలెన్స్ డీఎఫ్‌ఓ వెంకటేశ్వర్లు మంగళవారం ఉదయం తన ఇంట్లో ఓ మహిళతో రాసలీలలు సాగిస్తుండగా స్థానికులు, విద్యార్థి సంఘాల నాయకులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.

Pages