S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/11/2018 - 01:53

విజయవాడ, జనవరి 10: పీఏసీ చైర్మన్, వైసీపీ నాయకుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వాస్తవాలను వక్రీకరిస్తూ బాధ్యతా రహితంగా మాట్లాడుతున్నారని, పీఏసీ చైర్మన్ పదవికి మచ్చతెచ్చేలా ప్రవర్తిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు.

01/11/2018 - 01:53

విజయవాడ, జనవరి 10: ఉద్యోగాల కల్పన విషయంలో ప్రభుత్వం అవాస్తవాలు చెబుతోందంటూ వైసీపీ నేతలు మాట్లాడటం వారి దివాలాకోరుతనానికి నిదర్శనమని టీడీపీ ఎమ్మెల్యేలు సాంబశివరావు, డేవిడ్‌రాజ్ అన్నారు. విభజన తర్వాత కష్టాల్లో ఉన్న ఏపీని పారిశ్రామికంగా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని పేర్కొన్నారు.

01/11/2018 - 01:52

ఆదివాసీలకు కలెక్టర్ పిలుపు మావోల ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

01/11/2018 - 01:51

విజయవాడ, జనవరి 10: ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న 45వేల మంది హిందూ ఉద్యోగులు, కార్మికులకు సంక్రాంతి పండుగ అడ్వాన్స్‌ల చెల్లింపులు బుధవారం సాయంత్రం నుంచి ప్రారంభమయ్యాయి. క్లాస్-4 ఉద్యోగులకు రూ. 4వేలు, క్లాస్-3 ఉద్యోగులకు రూ. 4,500 అడ్వాన్స్‌గా చెల్లిస్తున్నారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు, క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు అడ్వాన్స్ చెల్లింపులు జరిగాయి.

01/11/2018 - 01:02

వెదురుకుప్పం, జనవరి 10: సంక్షోభంలోవున్న వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు కృషి చేస్తానని ప్రజా సంకల్ప పాదయాత్రలో వై ఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలో బుధవారం జగన్ పాదయాత్ర జక్కదన నుంచి ప్రారంభమైంది. పాదయాత్రలో రైతులు, మహిళలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

01/11/2018 - 01:02

విజయవాడ (పాయకాపురం), జనవరి 10: మాయమాటలతో, అమలుకు సాధ్యంకాని హామీలతో దేశ ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ నిలువునా మోసం చేశారని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు. పెద్దనోట్ల రద్దు వల్ల దేశానికి ఒనగూరిన లాభం ఏమిటో ఆయన ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

01/11/2018 - 01:01

విజయవాడ, జనవరి 10: ఇస్లాం శాంతి, సామరస్యం, సోదర భావం, సహజీవనాన్ని ప్రబోధిస్తుందని, ఇహపరాల్లో సాఫల్యం కోసం మానవత్వంతో కూడిన ధార్మిక విద్యను ప్రబోధించే మదరసాలపై అసత్య ప్రచారానికి ఒడిగట్టిన షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీం రిజ్వీ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఎంఏ షరీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు.

01/11/2018 - 01:01

అమలాపురం, జనవరి 10: రాష్ట్రంలో ఫైబర్ గ్రిడ్ ద్వారా 500 చానళ్లను అతి తక్కువ ఖర్చుతో ప్రతీ ఇంటికీ అందించడానికి చర్యలు చేపట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

01/11/2018 - 01:00

పెందుర్తి, జనవరి 10: విశాఖ జిల్లా పెందుర్తి పోలీస్ స్టేషన్ ఎదుట ఓ వ్యక్తి వంటిపై పెట్రోలు పోసుకుని బుధవారం ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన నగరంలో సంచలనం కలిగించింది. ఈ సంఘటనకు సంబంధించి సీఐ జె.మురళి తెలిపిన వివరాల ప్రకారం స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులో నివాసముంటున్న మునస మహాలక్ష్మినాయుడు (45) గత ఏడాది అక్టోబర్‌లో తన భార్య మునస రాజరాజేశ్వరిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి హత్య చేశాడు.

01/11/2018 - 01:00

హైదరాబాద్, జనవరి 10: రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు, ఆస్తుల ప్రకటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెబుతున్న లెక్కలు, ఉద్యోగాల కల్పన వివరాలు పొంతనలేనివని, అవాస్తవాలని వైకాపా ధ్వజమెత్తింది.

Pages