S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/08/2018 - 03:08

విజయవాడ, జనవరి 7: అన్ని రంగాల్లో అంతర్జాతీయ, అత్యాధునిక సౌకర్యాలతో అలరారనున్న అమరావతి నెదర్లాండ్స్ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌ను మించిపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. నిరంతర నీరు, విద్యుత్, రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి, ప్రజల సంపూర్ణ మద్దతు కారణంగానే అమరావతికి అంతర్జాతీయ గుర్తింపు దక్కిందని పునరుద్ఘాటించారు.

01/08/2018 - 03:00

విజయవాడ (పటమట), జనవరి 7: స్వాతంత్య్రం రాకపూర్వం నుంచే క్రైస్తవ మిషనరీలు మన దేశంలో విద్య, వైద్య రంగాల్లో విశేష సేవలు అందిస్తున్నప్పటికీ నేటికీ వారి సమస్యలు పరిష్కరించటంలో ప్రభుత్వాలు పక్షపాత ధోరణి అవలంభిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్స్ లీడర్స్ ఫోరమ్ స్టేట్ కన్వీనర్ ఆలీవర్ రాయ్ అన్నారు.

01/08/2018 - 02:59

విజయవాడ (ఇంద్రకీలాద్రి), జనవరి 7: దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ వైవీ అనూరాధ ఆదివారం రాత్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇన్‌చార్జి ఈవోగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం రాత్రి ఇంద్రకీలాద్రికి చేరుకున్న ఆమె తొలుత అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం స్థానాచార్యుడు విష్ణ్భుట్ల శివప్రసాద్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

01/07/2018 - 04:04

విజయవాడ, జనవరి 6: నెల రోజుల్లోగా ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీని ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. ఐదో విడత జన్మభూమి-మాఊరు ఐదోరోజు కార్యక్రమంపై శనివారం రాత్రి క్యాంపు ఆఫీస్‌లో ఉన్నతాధికారులతో సమీక్షించారు. నాలుగో విడత జన్మభూమి కంటే ఐదో విడత జన్మభూమిలో ఎక్కువ శాతం పాల్గొన్నారని చెప్పారు.

01/07/2018 - 04:03

విజయవాడ (ఇంద్రకీలాద్రి) జనవరి 6: దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై తక్షణమే హైకోర్టు సిట్టింగ్ జడ్జితోవిచారణ జరిపించాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు.

01/07/2018 - 04:02

విజయవాడ, జనవరి 6: జన్మభూమి సభలు జరుగుతుంటే ఆదివారం సెలవుదినం కూడా పాఠశాలలు పనిచేయాలంటూ విద్యాశాఖ జారీచేసిన జీవో పట్ల అటు తల్లిదండ్రులు, విద్యార్థులు ఇటు ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వేలాదిమంది ఉపాధ్యాయులను నోడల్ అధికారులుగా నియమించడం వల్ల జన్మభూమి ప్రారంభం నుంచే కాకుండా..

01/07/2018 - 04:02

విజయవాడ, జనవరి 6: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ సమితి సమావేశాలు ఈనెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ విజయవాడలో నిర్వహిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. సీపీఐ అగ్రనేతలు సురవరం సుధాకరరెడ్డి, డి.రాజా, జాతీయ కార్యదర్శివర్గ సభ్యులతోపాటు 29 రాష్ట్రాలకు చెందిన రాష్ట్ర పార్టీ కార్యదర్శులు ఈ సమావేశాలకు హాజరవుతారని ఆయన వివరించారు.

01/07/2018 - 04:01

విజయవాడ, జనవరి 6: పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ కోసం ఈనెల 9తేదీ రాష్ట్ర వ్యాప్తంగా 210 పాత తాలూకా కేంద్రాల్లో ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికులు పెన్షన్ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం వరకు సామూహిక ధర్నాలు జరుపుతామని ఏపీ జేఏసీ చైర్మన్, ఏపీ ఎన్‌జీవో సంఘ అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు తెలిపారు. ఈ సందర్భంగా తామంతా ఆ సమయంలో అర్ధరోజు మూకుమ్మడి సెలవులు పెడుతున్నామన్నారు.

01/07/2018 - 04:00

విజయవాడ, జనవరి 6: ‘జన్మభూమితో ప్రతి ఊరు రూపురేఖలు మారిపోతున్నాయి. రోడ్లు, డ్రెయిన్లు, తాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం అన్ని వౌలిక వసతులు ఏర్పడుతున్నాయి. మనం చేస్తున్న పనుల పట్ల పూర్తి సంతృప్తి ఉంది. మూడున్నరేళ్ల నిరంతర శ్రమ ఫలితాలు అన్నిచోట్ల కనిపిస్తున్నాయంటూ’ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఉండవల్లి తన నివాసం నుంచి జన్మభూమి-మాఊరుపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

01/07/2018 - 03:53

విజయవాడ, జనవరి 6: దుర్గగుడిలో తాంత్రి క పూజల వివాదం నేపథ్యంలో ఆ దేవస్థాన ఈవో సూర్యకుమారిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవోపై బదిలీ వేటు వేసి, ఇన్‌చార్జిగా దేవాదాయ శాఖ కమిషనర్ అనూరాధను నియమించేందుకు నిర్ణయించారు. దుర్గగుడిలో తాంత్రిక పూజల వివాదంపై పోలీస్, దేవాదాయ శాఖ వేర్వేరుగా విచారణ జరపడం తెలిసిందే. 48 గంటల్లో నివేదికలు అందచేయాలని సీఎం ఆదేశించటం కూడా తెలిసిందే.

Pages