S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/12/2017 - 00:37

విజయవాడ (పటమట) నవంబర్ 11: బ్యాంకులపై బహుళజాతి కంపెనీల గుత్త్ధాపత్యంతో బ్యాంకింగ్ రంగంతోపాటు, ఖాతాదారులూ నష్టపోతున్నారని అఖిల భారత పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రధానకార్యదర్శి పిఆర్ మెహతా ఆందోళన వ్యక్తం చేశారు.

11/11/2017 - 04:33

తాళ్లపూడి, నవంబర్ 10: ఎత్తిపోతల పథకాలకు సంబంధించి భూసేకరణ వివాదాస్పదమవుతున్న పరంపరలో మరో పథకం భూసేకరణ వివాదాస్పదమయ్యింది. పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్మిస్తున్న చింతలపూడి ఎత్తిపోతల పథకానికి భూసేకరణ వ్యవహారం తాజాగా వివాదాస్పదమయ్యింది. తమకు తెలియకుండా అధికార్లు సర్వేకు వచ్చారని ఆగ్రహిస్తూ రైతులు ఆందోళనకు దిగడంతో శుక్రవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

11/11/2017 - 04:31

విజయవాడ, నవంబర్ 10: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌కు ఈ దేశంలో సముచిత స్థానం కల్పించింది.. కల్పిస్తున్నది తెలుగుదేశం పార్టీ ఒక్కటేనని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. డాక్టర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా రాజధాని అమరావతిలో వంద కోట్లతో 125 అడుగుల విగ్రహం ఏర్పాటుతోపాటు చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా 20 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతి వనం ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు.

11/11/2017 - 04:31

విజయవాడ, (పటమట) నవంబర్ 10: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా శుక్రవారం ఉదయం హోం మంత్రి చినరాజప్ప తన చాంబర్‌లో సహచర మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు స్వీట్లు పంచిపెట్టారు. అయితే స్వీట్లు పంచడంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు చమత్కరించడం గమనార్హం. ప్రతిపక్షం లేని సమావేశాలు జరుగుతున్నాయని హోం మంత్రి స్వీట్లు పంచుతున్నారని పలువురు ఎమ్మెల్యేలు చమత్కరించారు.

11/11/2017 - 04:30

అమరావతి, నవంబర్ 10: గత 35 ఏళ్ల తర్వాత కేకలు, అరుపులు, ఆందోళనలు లేకుండా శాసనసభ సమావేశాలు ‘అత్యంత’ ప్రశాంతంగా మొదలయ్యాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు వరకూ కాంగ్రెస్, కమ్యూనిస్టు, జనతా,లోక్‌దళ్ పార్టీలే సభలో ఉన్నప్పటికీ.. ఆ సభలో చర్చలు ఆహ్లాదకరంగా, సుహృద్భావ వాతావరణంలో జరిగేవి. టీడీపీ ఆవిర్భవించిన తర్వాత అసెంబ్లీ సమావేశాల దృశ్యం పూర్తిగా మారిపోయింది.

11/11/2017 - 03:37

గుంటూరు, నవంబర్ 10: ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు గురించి ప్రతి సమావేశాల్లో చర్చించాలనుకున్నా.. ఈ విషయం మీకు ఎన్నోసార్లు చెప్పా.. అయితే ఆచరణలో విఫలమవుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేశారు..

11/11/2017 - 03:37

గుంటూరు, నవంబర్ 10: ముఖ్యమంత్రి చంద్రబాబు అపర భగీరథుడు.. అభినవ శ్రీకృష్ణ దేవరాయలు.. మరో కాటన్ అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు పొగడ్తలతో ముంచెత్తారు.. శుక్రవారం శాసనసభ సమావేశాల తొలిరోజు పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల ప్రగతిపై సుదీర్ఘ చర్చ జరిగింది. సమావేశాలను ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ బహిష్కరించటంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు రెట్టించిన ఉత్సాహంతో సీఎం దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు చేశారు.

11/11/2017 - 03:35

గుంటూరు, నవంబర్ 10: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు చట్టసభల నుంచి ఏదైతే ఆశిస్తారో ప్రస్తుతం ప్రారంభమైన శాసనసభ సమావేశాల్లో ఆ మేరకు అర్థవంతమైన చర్చ సాగిందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం శాసనసభ తొలిరోజు సమావేశాలు ముగిసిన అనంతరం మీడియా పాయింట్‌లో మంత్రి శ్రీనివాసులు మాట్లాడుతూ శాసనసభ, శాసనమండలిలో తొలిసారిగా అర్థవంతంగా చర్చలు సాగాయన్నారు.

11/11/2017 - 03:35

విజయవాడ, నవంబర్ 10: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వేల కోట్ల నష్టాల ఊబిలో చిక్కున్న ఆర్టీసీని అన్ని వర్గాల ప్రజలకు చేరువ చేస్తూ, సంస్థను లాభాల బాటలో పయనింప చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక సంస్కరణలు చేపట్టారని రవాణాశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

11/11/2017 - 03:33

విజయవాడ, నవంబర్ 10: కొల్లేరు సరస్సు ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన కొల్లేరు సమస్యలపై అధికారులతో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు వీలుగా కన్సల్టెంట్‌ను నియమించాలని ఆదేశించారు.

Pages