S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/15/2017 - 04:02

విజయవాడ, నవంబర్ 14: రాష్ట్రంలోని నదీ తీర పర్యాటక ప్రాంతాల్లో పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో బోటు ప్రమాదాల నివారణపై ఇరిగేషన్, పోలీస్, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్టీఆర్‌ఎఫ్, టూరిజం, విపత్తుల నివారణ అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

11/15/2017 - 03:25

విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 14: భారతదేశంలో సామాజిక సేవలో హిందువులు భాగస్వాములవ్వాలని, ప్రతి రోజూ వండే బియ్యంలో గుప్పెడు బియ్యం తీసి నెలకు సమకూరిన బియ్యాన్ని పేదలకు పంచాలని అఖిర భారత విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు ప్రవీణ్‌భాయ్ తొగాడియా పేర్కొన్నారు.

11/15/2017 - 03:25

అమరావతి, నవంబర్ 14: తక్కువ బడ్జెట్ సినిమాలకు పన్ను రాయితీ ఇవ్వాలన్న అంశాన్ని పరిశీలిస్తున్నామని, పరిశ్రమ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.

11/15/2017 - 03:24

విజయవాడ, నవంబర్ 14: ప్రజలకు ఇబ్బంది కలిగించనంత వరకు ఉద్యోగులకు అండగా ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయం 3వ బ్లాక్‌లో ఏపీ ప్రభుత్వ సచివాలయ ఉద్యోగుల సహకార సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు, జర్నలిస్టులు, పోలీసులకు 50 శాతం రాయితీపై ఏర్పాటు చేసిన ఫలహారశాలను మంగళవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు.

11/15/2017 - 03:24

కర్నూలు, నవంబర్ 14: రాష్ట్ర ప్రజలు తనకు అధికారమిస్తే తాను ఇస్తున్న ప్రతి హామీ నెరవేర్చి తీరుతానని వైకాపా అధినేత జగన్ భరోసా ఇచ్చారు. కడప జిల్లాలో పాదయాత్ర ముగించిన జగన్ కర్నూలు జిల్లాలోకి మంగళవారం అడుగుపెట్టారు.

11/15/2017 - 03:23

విజయవాడ, నవంబర్ 14: తెనాలి సబ్ ట్రెజరీలో మరణించిన మహిళ పేరిట పింఛన్‌తో పదేళ్లపాటు దాదాపు 12లక్షల రూపాయలు పైగా దోపిడీ జరిగిన ఘటనపై తక్షణం క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ట్రెజరీశాఖ డైరక్టర్ టి.మోహనరావు మంగళవారం గుంటూరు జిల్లా ట్రెజరీ అధికారికి ఆదేశాలు జారీ చేశారు. మరణించిన ప్రభుత్వ ఉద్యోగి భార్య కోట కృష్ణమ్మ కుటుంబ పెన్షన్ పొందుతూ 2007లో మరణించింది.

11/15/2017 - 03:23

విజయవాడ, నవంబర్ 14: ఆసియా కప్పులో బంగారు పతకం సాధించిన హాకీజట్టులోని క్రీడాకారిణి రజనీని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందించారు. వెలగపూడి సచివాలయంలో సిఎంను ఆమె మంగళవారం కలిశారు. హాకీలో మరింత రాణించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. దేశానికి మరిన్ని పతకాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ పేరును అంతర్జాతీయంగా మార్మోగేలా చేయాలని కోరారు. ఇందుకు అవసరమైన సహాయం చేసేందుకు సిద్ధమని హామీ ఇచ్చారు.

11/15/2017 - 03:22

విజయవాడ(బెంజిసర్కిల్), నవంబర్ 14: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్‌గా ఎన్‌ఎండి ఫరూఖ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసన మండలి చైర్మన్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ చివరి రోజు కేవలం ఫరూఖ్ ఒక్కరే దాఖలు చేయడంతో ఆయన ఎన్నికల ఏకగ్రీవం కానుంది. మంగళవారం ఆయన శాసన మండలి చైర్మన్ పదవికి నామినేషన్ పత్రం పూర్తి చేయగా దానికి మంత్రి లోకేష్ బలపరిచారు.

11/15/2017 - 03:22

విజయవాడ, నవంబర్ 14: 2019 నాటికి రాష్ట్రంలో ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఏర్పాటు చేయటంతో పాటు 30లక్షల ఎల్‌ఈడీ వీధి బల్బులు అమర్చుతామని, ప్రతి గ్రామానికి కార్యదర్శి ఉండేలా 4వేల 500 గ్రామాలకు ఔట్‌సోర్సింగ్‌లో నియామకాలు చేపడతామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు.

11/13/2017 - 05:53

అనకాపల్లి, నవంబర్ 12: రాష్ట్రంలో 35వేల కోట్లతో ఐదున్నర లక్షల ఇళ్ళను పేదవారికి నిర్మించి ఇచ్చే దృఢ నిశ్చయంతో బాబు ప్రభుత్వం పనిచేస్తోందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. 2018 డిసెంబర్ నాటికి ఈ పక్కాగృహ నిర్మాణం పూర్తయి పేదవారి సొంతింటి కలలు నెరవేరనున్నాయన్నారు.

Pages