S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/09/2017 - 02:11

విజయవాడ, జూలై 8: రాష్ట్రంలోని ఆరు లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంతి ఉద్యోగుల ప్రయోజనాలే లక్ష్యంగా, వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అన్నింటి మించి సంఘాల బలోపేతానికి పోరాడుతున్నది, వారి శ్రేయస్సుకు పాటుపడుతున్నది ఏపి అమరావతి జెఎసి ఒక్కటేనని జెఎసి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు.

07/08/2017 - 03:29

అమరావతి, జూలై 7: గతంలో ఐదున్నరలక్షల ఓట్ల తేడాతో కోల్పోయిన అధికారాన్ని తిరిగి సంపాదించుకుని, జగన్‌ను సీఎంగా చూడాలన్న లక్ష్యంతో ఉత్తరాది నుంచి దిగుమతి చేసుకున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రానున్న ఎన్నికల్లో పార్టీని ఏవిధంగా గట్టెక్కిస్తారన్న ఆసక్తికరమైన చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. తొలుత మోదీ, తర్వాత అరవింద్ కేజ్రీవాల్, ఆ తర్వాత నితీష్‌కుమార్‌ను గెలిపించిన పి.కె.

07/08/2017 - 03:28

అమరావతి, జూలై 7: ప్రభుత్వంపై పోరాటాల వరకు ప్రతిపక్ష నేత జగన్ వ్యవహార శైలి బాగానే ఉన్నప్పటికీ ఆయన వ్యవహారశైలి, ఒంటెత్తు పోకడలపై సొంత పార్టీలో వ్యక్తమవుతున్న విమర్శలకు మాత్రం తెరదించలేకపోతున్నారు.

07/08/2017 - 03:27

అమరావతి, జూలై 7: ఒక్కోరిది ఒక్కో కష్టం. అందరివీ చితికిన బతుకులే. అంతా తమ కష్టాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎదుట ఆవిష్కరించారు. దాంతో వారి కష్టాలను విని చలించిన చంద్రబాబు అక్కడికక్కడే వారికి ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక రోగికి ఆర్థిక సాయం అందించటంతో పాటు అంబులెన్స్ తెప్పించి వారి గ్రామానికి తరలించిన వైనం శుక్రవారం నాటి సిఎం సందర్శన కార్యక్రమంలో చోటు చేసుకుంది.

07/08/2017 - 03:27

గుంటూరు, జూలై 7: ఎమ్మార్పీఎస్ కురుక్షేత్ర మహాసభ రణరంగాన్ని తలపించింది. సభను పోలీసులు భగ్నం చేసినా వేలాది మంది కార్యకర్తల ఆందోళనతో అట్టుడికింది.

07/08/2017 - 03:26

గుంటూరు, జూలై 7: ఎమ్మార్పిఎస్ నేత మంద కృష్ణమాదిగను శుక్రవారం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో పోలీసులు అరెస్టు చేశారు. కురుక్షేత్ర సభకు వచ్చి స్పృహ కోల్పోయి, జిజిహెచ్‌లో చికిత్స పొందుతున్న అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన కార్యకర్తను పరామర్శించి తిరిగి వెళుతుండగా నగర డిఎస్పీలు సరిత, సంతోష్ ఆధ్వర్యంలో సిబ్బంది ఆయనను అరెస్టు చేసి కొత్తపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

07/08/2017 - 03:23

విజయవాడ, జూలై 7: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూల పరిస్థితులపై ప్రచారం చేయాలని అధికారులను రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ఎపి ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి ఏజన్సీ అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆయన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి మరిన్ని కంపెనీలను తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

07/08/2017 - 03:23

విజయవాడ, జూలై 7: అమరావతిలో రాజధాని నిర్మాణానికి వ్యతిరేకంగా న్యాయస్థానాలకు వెళ్లేవారిని, ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాసేవారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయిన నేపథ్యంలో తమకు ఎలాంటి హాని జరిగినా అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సిఆర్‌డిఏ కార్యదర్శి చెరుకూరి శ్రీ్ధర్ మాత్రమే బాధ్యులవుతారంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) ఫిర్యాదుదారుడు పండలనేని శ్రీమన్నారాయణ, ఉండవల

07/08/2017 - 03:22

గుంటూరు ( కల్చరల్), జూలై 7:పూర్వాశ్రమంలో ఆశు కవితానిధిగా పేరొంది, హిందూ కళాశాల ప్రిన్సిపాల్‌గా సేవలందించిన డాక్టర్ ప్రసాదరాయ కులపతి (ప్రస్తుతం కుర్తాళ పీఠాధిపతి) సతీమణి పోతరాజు కులపతి సుందరీదేవి (75) శుక్రవారం ఆనారోగ్యంతో స్థానిక ఆస్పత్రిలో అస్తమించారు. గత రెండు మాసాలుగా తీవ్ర అనారోగ్యంతో వున్న సుందరీదేవి శుక్రవారం కన్ను మూశారు.

07/08/2017 - 03:10

ఆదోని, జూలై 7: కర్నాటకలోని శృంగేరి, మలనాడు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో తుంగా నదికి వరద చేరుతోంది. దీంతో దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. గత వారం రోజులుగా తుంగభద్ర జలాశయానికి క్రమంగా నీటి చేరిక చేరుతోంది. సోమ, మంగళవారాల్లో తుంగా డ్యాం నుంచి 9 వేల క్యూసెక్కుల నీరు తుంగభ్రదకు చేరుకుంది. బుధవారం తుంగా డ్యాంలో పూర్తిస్థాయి నీటి మట్టాన్ని ఉంచి దిగువకు 4,500 క్యూసెక్కుల నీటిని వదిలారు.

Pages