S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/07/2017 - 02:02

భీమవరం, జూలై 6: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల విద్యార్థులకు మీజిల్స్ అండ్ రుబెల్లా (ఎంఆర్) వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 1నుంచి ఈ కార్యక్రమం ప్రారంభిస్తారు. మీజిల్స్, రుబెల్లా వైరస్‌ల కారణంగా పొంగు వ్యాధితోపాటు జ్వరం, కళ్ళు ఎర్రబడటం, ఒంటి నిండా మచ్చలు రావడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధులు 9 నెలల నుంచి 15 ఏళ్లలోపు వారికి ఎక్కువగా వస్తుంది.

07/07/2017 - 02:01

విజయవాడ, జూలై 6: కృష్ణా నదీ జలాల వాడకంతోపాటు ఆంధ్రప్రదేశ్‌ని కరవు రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. విజయవాడలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు చైర్మన్ శ్రీవత్సవతో గురువారం భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబుని కలవటానికి వచ్చిన శ్రీవత్సవకు మంత్రి దేవినేని పలు విషయాలు వివరించారు.

07/07/2017 - 01:58

ద్వారకాతిరుమల, జూలై 6: రాష్ట్రంలో పారిశ్రామిక, వ్యవసాయ ప్రజావసరాలకు సంబంధించి ప్రత్యేక విద్యుత్ లైన్ల ఏర్పాటుకు రూ.4,500 కోట్లు వెచ్చించాల్సి ఉందని, దీనికి కేంద్ర సాయంకోసం కృషిచేస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కిమిడి కళా వెంకట్రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి కేంద్ర సహకారం అవసరమన్నారు.

07/07/2017 - 01:58

విజయవాడ, జూలై 6: మద్యం దుకాణాలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులున్నా ప్రజలు నేరుగా తనకు తెలియజేయవచ్చని, అలాంటి ఫిర్యాదులను 24 గంటల్లో పరిష్కరిస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ తెలిపారు. గురువారం వెలగపూడి సచివాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ మద్యం వ్యాపారం రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ప్రతిపక్షాలు పేర్కొనడాన్ని ఖండించారు.

07/06/2017 - 03:17

విజయవాడ, జూలై 5: రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు తగ్గించేందుకు విద్యుత్ శాఖ కసరత్తు ప్రారంభించింది. భవిష్యత్తులో విద్యుత్ చార్జీలు పెంచకుండా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం, తగ్గించే అంశంపై దృష్టి సారించింది. ఈ విషయాన్ని వెలగపూడి సచివాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకటరావు వెల్లడించారు.

07/06/2017 - 03:17

విజయవాడ, జూలై 5: ప్రకృతి విపత్తుల నిర్వహణకు సంబంధించి రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలు దేశానికే ఆదర్శంగా ఉంటున్నాయని రాష్ట్ర ప్లానింగ్ విభాగం ఎక్స్ అఫిషియో కార్యదర్శి సంజయ్ గుప్తా అన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినపుడు ప్రాణనష్టం లేకుండా, ఆస్తి నష్టం వీలైనంత తక్కువ స్థాయిలో ఉంచేందుకు రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సంస్థ తీసుకుంటున్న చర్యలు ఉపయుక్తంగా ఉంటున్నాయన్నారు.

07/06/2017 - 03:16

అమరావతి, జూలై 5: దేశ చరిత్రలోనే తొలిసారిగా పిడుగు పడే సమాచారాన్ని అరగంటలో అందించే సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు అందించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకేసి పిడుగులు, ఉరుముల సమాచారంతో పాటు వాటి తీవ్రత, ప్రజల రక్షణస్థాయిని కూడా హెచ్చరించే సరికొత్త యాప్‌ను ‘ఇస్రో’ సాయంతో ఆవిష్కరించింది.

07/06/2017 - 03:16

విజయవాడ, జూలై 5: ప్రపంచ వ్యాప్తంగా సైబర్ దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆయన బుధవారం సైబర్ సెక్యూరిటీపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వెబ్‌సైట్ల హ్యాకింగ్, వన్నాక్రై వంటి వైరస్‌ల బెడద ఎక్కువ అవుతోందన్నారు.

07/06/2017 - 03:16

విజయవాడ, జూలై 5: ఎర్ర చందనం దుంగల వ్యవహారంలో పట్టుబడిన వ్యాన్‌కు సంబంధించి వైకాపా ఎమ్మెల్యే రోజా ఆధారాలు లేకుండా మాట్లాడటం సరికాదని మంత్రులు అదినారాయణ రెడ్డి, అమర్‌నాథ్ రెడ్డి అన్నారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ సిఎంగా చంద్రబాబు మూడోసారి ఎన్నికయ్యారని, అంత దిగజారి వ్యవహరించాల్సిన అవసరం లేదన్నారు.

07/05/2017 - 04:14

కె.డి.పేట,జూలై 4: స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు చారిత్రక చిహ్నాలను గుర్తిస్తూ విశాఖ జిల్లా కృష్ణాదేవిపేటలో 10 కోట్లతో త్వరలో మ్యూజియం నిర్మిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. మంగళవారం అల్లూరి 120వ జయంతి ఉత్సవాలు కృష్ణాదేవిపేటలోని అల్లూరి పార్కులో అత్యంత వైభవంగా నిర్వహించారు.

Pages