S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/18/2016 - 07:50

విశాఖపట్నం, ఏప్రిల్ 17: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కొడుకు లోకేశ్‌ను మంత్రిని చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, తండ్రి తుప్పు అని, కొడుకు పప్పు అని ఎమ్మెల్యే, వైకాపా మహిళా విభాగం అధ్యక్షురాలు రోజా విమర్శించారు. అసెంబ్లీలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి యనమల రామకృష్ణుడు వెటకారంగా మాట్లాడటం మినహా అతనికి కేంద్రం నుంచి రెవెన్యూలోటు భర్తీ, రైల్వే జోన్ సాధన వంటివి పట్టవని విమర్శించారు.

04/18/2016 - 05:56

కొవ్వూరు/నిడదవోలు, ఏప్రిల్ 17: పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆరుగురు యాత్రికులు బీహార్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. మృతుల్లో రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురు ఉన్నారు.

04/18/2016 - 05:47

విజయవాడ, ఏప్రిల్ 17: ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలను రద్దు చేయాలన్న ఆలోచనకు వచ్చింది. సోమవారం విజయవాడలో జరగనున్న క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. గ్రామ, పట్టణ ప్రాంతాల్లోని పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, ఇళ్ల మంజూరుకు ఈ కమిటీ సభ్యులే లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. కమిటి సూచించిన వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు అందుతాయి.

04/18/2016 - 05:42

విజయవాడ, ఏప్రిల్ 17: కొత్త అసెంబ్లీ నిర్మాణానికి వాస్తు సవరణ జరిగింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా వెలగపూడిలో ఐదు బ్లాకుల్లో సెక్రటేరియట్ శరవేగంగా తయారవుతోంది. ఆరోబ్లాక్‌లో అసెంబ్లీ భవనాన్ని నిర్మిస్తున్నారు. ముందు ఉత్తర ముఖంగా అసెంబ్లీ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశారు.

04/18/2016 - 05:35

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 17: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రౌడీషీటర్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. కేరళకు చెందిన ఒక యువతిని కొందరు దుండగులు ఎత్తుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బైక్‌పై తీసుకెళుతున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాధితురాలు గాయపడింది. గుట్టుచప్పుడు కాకుండా ఆమెను ఆసుపత్రిలోచేర్చి రేపిస్టులు పరారయ్యారు.

04/18/2016 - 05:33

విజయవాడ, ఏప్రిల్ 17: అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి ఈ వేసవిలోఎదురయ్యే సమస్యలకు తగిన కార్యాచరణ చేపట్టాలని సిఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నీటి ఎద్దడి, పశుగ్రాసం కొరత, సాగునీరు, వ్యవసాయం, ఉద్యాన పంటలు, ఇతర అంశాలపై వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ముఖ్యమంత్రి తన నివాసంలో ఆదివారం మధ్యాహ్నం సమావేశం నిర్వహించారు.

04/17/2016 - 20:57

హైదరాబాద్, ఏప్రిల్ 16: చంద్రబాబుపరిపాలన బాగుందని సిఎంఎస్ సర్వే వెల్లడించిన ఫలితాలు బూటకమని, ఈ సర్వే సంస్ధ ముఖ్యమంత్రి చంద్రబాబు బంధువులదని వైకాపా సీనియర్ నేత అంబటి రాంబాబు విమర్శించారు. శనివారం ఆయన ఇక్కడ విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబుకు ప్రత్యామ్నాయం ఆంధ్రప్రదేశ్‌లో లేదని ఈ సర్వే ద్వారా చెప్పించారన్నారు.

04/17/2016 - 20:57

హైదరాబాద్, ఏప్రిల్ 16: ఆంధ్రప్రదేశ్‌లో పలు విద్యా సంస్థలకు ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం విడివిడిగా జివోలు జారీ చేసింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం తడకల్ల వద్ద 172.08 ఎకరాలను ఎన్‌ఐటికి ఏర్పాటు కేటాయించింది.

04/17/2016 - 20:56

హైదరాబాద్, ఏప్రిల్ 16: ఆంధ్రప్రదేశ్‌లో అమృత్ పట్టణాల అభివృద్ధి పథకానికి రూపకల్పన చేసేందుకు గాను మూడు కన్సల్టెన్సీలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కన్సల్టెన్సీలను ప్రభుత్వ అపెక్స్ కమిటీ ఖరారు చేసింది.

04/17/2016 - 20:55

మాడుగుల, ఏప్రిల్ 16: విశాఖపట్నం జిల్లా మాడుగుల గ్రామంలో 12 అడుగుల నల్లతాచును స్థానికులు హతమార్చారు. గ్రామంలోని రెల్లివీధిలో ఉంటున్న బొమ్మాల అప్పలరాజు ఇంటిలోకి శనివారం తెల్లవారుజామున ఒంటిగంట ప్రాంతంలో నల్ల తాచుపాము ప్రవేశించింది. పామును గమనించిన అదే కాలనీకి చెందిన ధనేష్, రామకృష్ణ గట్టిగా కేకలు వేశారు. దీంతో వీధిలోని జనం లేచి పామును పట్టుకునే పనిలో పడ్డారు.

Pages