S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/06/2018 - 04:39

విజయవాడ, నవంబర్ 5: రాష్ట్రంలో కొన్ని పార్టీల నేతలు మరీ బరితెగించి మాట్లాడుతున్నారని, తమ స్థాయి ఏమిటో తెలుసుకోకుండా టీడీపీనీ, ముఖ్యమంత్రిని విమర్శించడమే లక్ష్యంగా అచ్చోసిన ఆంబోతుల్లా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు.

11/06/2018 - 03:00

గుంటూరు, నవంబర్ 5: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారిలో అత్యధికులు నేరస్థులేనని పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఆరోపించారు. ఇక్కడి టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కోడికత్తి డ్రామాతో నవ్వుల పాలవుతున్న వైసీపీ నేతలు, ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు వందలాది తప్పులు చేస్తూ ప్రజల్లో మరింత చులకన అవుతున్నారని విమర్శించారు.

11/06/2018 - 02:39

అమరావతి, నవంబర్ 5: రాష్ట్రంలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలను నిర్దేశిత లక్ష్యాల ప్రకారం పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా ఆదేశించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో సోమవారం రాష్ట్ర హోం, వైద్య, ఆరోగ్య శాఖ, ట్రాన్స్‌కో ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

11/06/2018 - 02:37

అమరావతి, నవంబర్ 5: అమరావతిలో ప్రజల కోసం తొలి నిర్మాణ ప్రాజెక్ట్ ‘హ్యాపీనెస్ట్’ను ప్రారంభించటం శుభ పరిణామమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. తక్కువ ధరలో అధునాతన ఇంటిని సొంతం చేసుకోవాలనుకునే అల్పాదాయ, మధ్యతరగతి వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ ప్రణాళిక రూపొందించాలని రాజధాని ప్రాధికార అభివృద్ధి సంస్థ (ఏపీ సీఆర్డీఏ) అధికారులను ఆదేశించారు.

11/06/2018 - 02:36

పోలవరం, నవంబర్ 5: పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వెళ్లే రహదారి పైకి ఉబికి, బీటలు తీసిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాన్ని అధికారులు సిద్ధంచేశారు. సోమవారం ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణం పూర్తవ్వడంతో రాకపోకలు ప్రారంభమయ్యాయి. గత శనివారం ప్రాజెక్టుకు వెళ్లే రోడ్డు ఆరు మీటర్ల ఎత్తుకు పెరగడంతోపాటు బీటలు తీయడంతో 19 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన విషయం విదితమే.

11/06/2018 - 02:34

విజయవాడ, నవంబర్ 5: ఏపీ రాష్ట్ర సివిల్ సర్వీసెస్‌కు చెందిన 9 మందిని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లోకి చేర్చడంతో వారికి పోస్టింగ్‌లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

11/06/2018 - 02:34

విజయవాడ, నవంబర్ 5: రాష్ట్రంలో వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న స్పెషల్ టీచర్ల సర్వీసుకు అప్రయత్న పదోన్నతి, సర్వీసు లెక్కింపు ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జారీ చేసింది. 1990 నుంచి 1996 మధ్య 398 రూపాయల వేతనంపై పనిచేస్తున్న స్పెషల్ టీచర్ల సర్వీస్ లెక్కించేందుకు నిర్ణయించింది. దీనివల్ల స్పెషల్ టీచర్లకు సమన్యాయం జరగనుంది.

11/06/2018 - 02:33

విజయవాడ, నవంబర్ 5: రెవెన్యూ ఉద్యోగుల పనితీరు ప్రశంసనీయమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పుణేఠా అన్నారు. వెలగపూడి సచివాలయంలో ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కొత్తగా రూపొందించిన నియమావళి పుస్తకాన్ని సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గత నాలుగేళ్లలో తీసుకొచ్చిన సంస్కరణలు రెవెన్యూ శాఖను ప్రజలకు చేరువ చేసిందన్నారు.

11/06/2018 - 02:33

విజయవాడ, నవంబర్ 5: కడపలో ఈ నెల 11న జాతీయ మైనారీటీ సంక్షేమ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర మైనారిటీస్ కార్పొరేషన్ చైర్మన్ ఎండీ హిదాయత్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆయన సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ నాలుగున్నర సంవత్సరాల్లో టీడీపీ ప్రభుత్వ హయంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు.

11/06/2018 - 02:32

విజయవాడ, నవంబర్ 5: రాష్ట్రంలో చుక్కల భూముల సమస్యను నెల రోజుల్లో పరిష్కరించాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన రెవెన్యూ శాఖ అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ సీఎం ఆదేశించిన మేరకు నెలరోజుల్లో ఈ సమస్యకు తెరదించాలన్నారు. ప్రతివారం టెలీకాన్ఫరెన్సు నిర్వహించి సమస్య పరిష్కారంపై సమీక్ష నిర్వహించాలని అధికారులను కోరారు.

Pages