S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

10/31/2019 - 19:04

ఐనప్పటికీ తన శత్రువు విశాల హృదయుడు కనుక, తనకు మరో సదవకాశాన్నిచ్చి, ఇంకో రకం యుద్ధానికి ఆహ్వానించాడు.
దేన్నయితే తాను, శక్తితో, బలిమితో సాధించలేకపోయిందో, దానే్న ఇప్పుడు యుక్తితో, చెలిమితో సాధించాలి. బైటి శక్తులు కానీ, కొత్తవీ, శత్రువుకు ప్రమాదకరమైనవీ, పదునైనవలీ అయిన ఆయుధాలు కానీ తనకు అందుబాటులో లేవు; త్వరలో అందుతవనే ఆశలూ లేవు. ఇంతకుముందు తాను ప్రయోగించినవన్నీ నిష్ప్రయోజనమైనవి.

10/30/2019 - 19:10

ఐతే ఇలా జరిగినందుకు తాను ఎందుకని ఇంతసేపూ విచారపడింది? ఏదో అశుభం ముంచుకొస్తోందని భయపడి కుంగిపోవటం దేనికి? ఎవరి స్వార్థాలను వారు తృప్తిపరుస్తూనే ఉన్నారు. మడి కట్టకుని ముడులు వేసుకొని ఇతరులకు మాత్రమే మేలు చేకూర్చే పదార్థంగా ఎందుకుండాలి?
ఇతరులకు మేలు చేయగల సామర్థ్యం ఉన్నవారు తమకు తాము చేసుకొనే మేలునుగూర్చి ఆలోంచలేని అజ్ఞానులవలేరు కదా!

10/29/2019 - 19:57

నిజానికి ఇంతకుముందు- ఆ మాటకొస్తే, తాను ఈ గృహ ప్రాంగణంలో అడుగుపెట్టినప్పటినుంచీ జరిగింది అద్భుతమా- మహాద్భుతం కాని! మరొకటి ఇలాంటిది, ఇప్పుడు జరిగినదానికి సరిగ్గా విరుద్ధంగా ఉండేది సంభవించాలని తాను కోరటం తన అల్పత్వం; తాను కోరినంత మాత్రాన జరగటం అసంభవం!

10/28/2019 - 19:42

‘‘గోళ్ళు పెట్టి గట్టిగా కండలు ఊడివచ్చేట్లు పీకాక, ఎంత మెల్లిగా అనులేపనాన్ని రాస్తే మాత్రం నెప్పి ఉండదనుకుంటున్నావా?’’ దీనికి ప్రతీకారం తీర్చుకున్నపుడు ఈ బాధ ఎలాంటిదో నీకు తెలిసి వస్తుందిలే!’’ అని వీరభద్రుడు ఆమెను బెదిరించాడు.
‘‘నన్ను కూడా అంత గట్టిగా గిల్లేందుకూ మీ గోళ్ళు అంత వాడిగా లేవులెండి!’’ అంది సరస్వతి ముసిముసి నవ్వులు నవ్వుతూ.
‘‘నీకెలా తెలుసు!’’’

10/25/2019 - 20:01

తన స్వాధీనంలో లేని ఈ పతనంలో ఎక్కువగా గాయపడకుండా, కీళ్ళు కదిలిపోకుండా, ఎముకలు విరగకుండా కాస్త సుఖంగా ఉండే విధంగా నేల కరపటానికి మాత్రమే ప్రయత్నించాలి.
అదే అంతిమ పోరాటమైనట్లు, విజయమో, వీరస్వర్గమో అంతు తేలవలసిన అవసరం వున్నట్లూ ఆమెకు తోచింది. పమిటకొంగు నడుముచుట్టూ తిప్పి, బొడ్డున దోపి తాను సంసిద్ధురాలనయ్యానని ఆమె భావించింది.

10/24/2019 - 18:44

తానిచ్చిన సువర్ణ ముద్రికలనే ఎరకు లొంగని ఈ తిమింగలానికి సరైన ఎర తన శరీరమే కనుక, దీన్ని వశపరచుకోవటమే అతని లక్ష్యమూ, తనకు విధీ కనుక అనుసరణీయమైన మార్గం సుగ్రాహ్యమైంది. తిమింగలమే తనను లోతు నీటిలోకి లాగివేయగలిగిన శక్తిని ప్రయోగిస్తే, చేసేది లేక దానితో పాటే మునకలు వేసి, మెల్లిగా దాన్ని మచ్చిక చేసుకొని, క్రమంగా ఒడ్డు పట్టించి వశం చేసుకోవటమే అత్యుత్తమ మార్గం కనుక, నిరోధించదలచలేదు.

10/23/2019 - 19:56

రక్షక భటుల ఎదుట తనను భార్యగా ఒప్పుకున్నాడు కనుక; ఇప్పుడు బహిరంగంగా మాత్రం కాదనడు. పోతే, తన పట్ల అతనికి అసహ్యం పేరుకొనిపోయి ఉన్నట్లయితే దొడ్డిదోవలో తనకు ఉద్వాసన చెప్పి పీడ విరగడైందనుకుంటాడేమో? అలా జరిగితే తాను వచ్చిన పని సర్వనాశనమైనట్లే!

10/22/2019 - 19:59

అలాంటి క్లిష్టమైన పని చేయటానికి తానిప్పుడు సిద్ధమై శే్లష్మంలోని ఈగవలె ఇరుక్కుపోయింది!

10/21/2019 - 20:07

అదృష్టముండాలేకాని, మిగతా ఎన్ని ఉన్నా దానిముందు దిగదుడుపే. ఏమీ లేక అదృష్టం ఉంటే, ప్రతిభను అధిగమించి విజయాన్ని సాధించగలదది.
తానిప్పుడు ఊబిలో ఇరుక్కునట్లయింది. అదృష్టవశాత్తు తనను తానే సురక్షిత స్థలానికి జేర్చుకోగలదు; తల మునిగేదాకా ఆలోచిస్తూ కూర్చుంటే, పుణ్యకాలం కాస్తా పూర్తవుతుంది. అందుకని తొందరపడవలసిన అవసరాన్ని కూడా ఆమె గుర్తించింది.

10/20/2019 - 23:05

ఉదాహరణకు తానొక అనాకారి ఐ ఉండి తన ఐశ్వర్యం కారణంగా ఒక గొప్ప అధికారిని వివాహమాడగలిగి జీవితాన్ని గడుపుతున్న సమయంలో ఈ వీరభద్రుడు తన భర్తకు సిఫారసు చేసి ఉద్యోగం ఇప్పించమని వచ్చాడనుకుంటే- అపుడు తనకీ అందగాడిమీద రాగోద్దీపనమై తనతో మన్మథకేళి జరిపితే ఉద్యోగం తథ్యమని ఆశపెడితే ఇతనేం చేసి ఉండేవాడో?

Pages