S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/23/2016 - 05:26

నూజివీడు, సెప్టెంబర్ 22: ఉద్యమం ద్వారా ఏర్పడిన సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించాలని సమాచార హక్కు చట్టం కమిషనర్ లాము తాంతియా కుమారి చెప్పారు. స్థానిక రోడ్లు, భవనాల శాఖ అతిథిగృహంలో గురువారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు బలమైన వర్గాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయన్నారు.

09/23/2016 - 05:25

కూచిపూడి, సెప్టెంబర్ 22: మొవ్వ మండలం శివారు వీరాయలంక వద్ద జాతీయ రహదారి పక్కన ఉన్న 100 ఎకరాల వరి పైరు నీట మునగటంతో రైతులు అల్లాడుతున్నారు. మేనేజర్ మెయిన్ ఛానల్ ద్వారా వీరాయలంక పంట కాలువ ద్వారా కృష్ణా జలాలతో పాటు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు ఒకేసారి విడుదల కావటం, మూడు రోజుల నుండి వర్షం కురవటం, డ్రైనేజీ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉండటంతో పంట పొలాలు నీట మునిగాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు.

09/23/2016 - 05:25

అవనిగడ్డ, సెప్టెంబర్ 21: అవనిగడ్డ పంట కాలువలో బుధవారం రాత్రి ఈతకు దిగిన ఇద్దరు విద్యార్థులు గల్లంతు కాగా, వారి మృతదేహాలు గురువారం ఉదయం లభ్యమయ్యాయి. స్థానిక 9వ వార్డులోని సెవెన్త్‌డే ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులు పుల్లా చంద్(14), కసిరి పాండు(14), కులశేఖర్, విశ్వనాథపల్లి రాజేష్, బి విక్కీ బుధవారం మధ్యా హ్నం పరీక్షలు రాశారు.

09/23/2016 - 05:24

నాగాయలంక, సెప్టెంబర్ 21: మండలంలోని రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాములో వివిధ రకాల ఎరువులను అమ్మకానికి సిద్ధంగా ఉంచినట్లు వ్యవసాయ శాఖాధికారి బి రామసుబ్బారెడ్డి గురువారం ఇక్కడ తెలిపారు. ఇప్పటివరకు 5204 బిపిటి వరి విత్తనాలు 60 మెట్రిక్ టన్నులు విక్రయించామన్నారు.

09/23/2016 - 05:24

అవనిగడ్డ, సెప్టెంబర్ 21: మండల పరిధిలోని పులిగడ్డ గురుకుల విద్యాలయానికి చెందిన విద్యార్థులు బి పవన్‌కుమార్, సి బాలవంశీ రాష్టస్థ్రాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్-17 కబాడీ విభాగంలో జి బాలవంశీ గుడివాడ ఆర్డీఓ గ్రౌండ్స్‌లో జరిగిన కబాడీ పోటీల్లో పాల్గొని రాష్టస్థ్రాయికి ఎంపికయ్యాడు. పవన్‌కుమార్ వాలీబాల్ పోటీల్లో పాల్గొని రాష్టస్థ్రాయికి ఎంపికయ్యాడు.

09/23/2016 - 05:23

గుడ్లవల్లేరు, సెప్టెంబర్ 22: జిల్లా యువజన శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల క్రితం గుడివాడ ఎఎన్‌ఆర్ కళాశాలలో నిర్వహించిన యువజనోత్సవాల్లో గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. కూచిపూడి నృత్యం, జానపద గీతాలు, ఏకపాత్రాభినయంలో తమదైన ప్రతిభ కనబర్చి జిల్లాలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారని ప్రిన్సిపాల్ రామాంజనేయులు తెలిపారు.

09/23/2016 - 05:23

విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 22: విఎంసి కౌన్సిల్ సర్వ సాధారణ సమావేశం శుక్రవారం జరగనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకూ జరిగిన కౌన్సిల్ సమావేశాలతో పోల్చితే నేడు జరగబోయే కౌన్సిల్ సమావేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పవచ్చు.

09/23/2016 - 05:22

విజయవాడ, సెప్టెంబర్ 22: భారీ వర్షాలు, సైక్లోన్ ప్రభావం నేపధ్యంలో జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఏ ఒక్క ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బాబు.ఎ ఆదేశించారు.

09/23/2016 - 05:21

విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 22: ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్టు కెఎంకె పుష్కర టెండర్ వివాదంలో విఎంసి ఉద్యోగి ఒకరు సస్పెండ్‌కు గురయ్యారు.

09/23/2016 - 05:20

విజయవాడ (రూరల్), సెప్టెంబర్ 22: దేశ వ్యాప్తంగా ప్రజాపంపిణీ వ్యవస్థలో ఆధార్ బేస్‌డ్ నిత్యావసర సరుకుల విధానాన్ని 2017 మార్చి నుండి అమలు చేసేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కేంద్ర, పౌర సరఫరాల సహాయ కార్యదర్శులు జిల్లాలో రెండు రోజులు పర్యటించడం కోసం గురువారం నగరానికి చేరుకున్నారు.

Pages