S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/18/2016 - 00:27

వేములవాడ, జూలై 17: శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి అనుబంధ దేవాలయైన శ్రీ నాంపల్లి లక్ష్మినరసింహస్వామి ఆలయ గుట్టను పర్యాటక క్షేత్రపరంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు అందుకనుగుణంగా ప్రణాళికలను రూపొందించించింది. గుట్టపై రోప్ వే.. నిర్మాణం చేపడితే ఈ ప్రాంతంలో పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.

07/18/2016 - 00:27

మానకొండూర్, జూలై 17: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలని పచ్చని తెలంగాణ కోసం పాటుపడాలని జిల్లా ఎస్పీ జోయల్ డేవిస్ అన్నారు. అదివారం మానకొండూర్ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో మండల పరిధిలోని ఈదులగట్టేపల్లి గ్రామంలో మొక్కలను నాటే కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలను నాటారు.

07/18/2016 - 00:26

కమాన్‌పూర్, జూలై 17: నిన్నమొన్నటి వరకు పూర్తి స్థాయిలో ఏడారిగా ఉన్న గుండారం రిజర్వాయర్ ప్రస్తుతం జలకళతో నిండుకుండలా కళకళ లాడుతుంది. గత వారం రోజుల క్రితం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల వల్ల గౌరీ గుండ జలపాతం ద్వారా భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. దీంతో గుండారం రిజర్వాయర్ ప్రస్తుత నీటి మట్టం 12 అడుగులు కాగా ప్రస్తుతం 10 అడుగులకు పైగా నీరు చేరింది.

07/18/2016 - 00:26

ధర్మపురి, జూలై 17: అమెరికా ఆటా మహా సభలకు ఆహ్వానితులై, వెళ్ళి, ఆదివారం అర్ధరాత్రి దాటాక హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్‌కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ధర్మపురి నియోజకవర్గం నుండి ఈశ్వర్ అనుచరులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో స్వాగతానికి తరలి వెళ్ళారు.

07/18/2016 - 00:25

మహదేవపూర్, జూలై 17: మండలంలోని కాళేశ్వరం శ్రీ కాళేశ్వర ముక్తీకర స్వామి ఆలయంలో సినీ నటుడు వేణు మాధవ్ కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి ఆలయం వద్దకు చేరుకోగా ఆలయాధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి శుభానంద దేవి ఆలయంలో స్మామివారి తీర్థ ప్రసాదాలు, ఫొటోను బహుకరించారు.

07/18/2016 - 00:24

బాలసముద్రం, జూలై 17: అంబేద్కర్ ఆశయ సాధనకై ఉద్యోగులు నడుంబిగించాలని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల రాష్ట్ర కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఆదివారం కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జాతి విముక్తి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేక చట్టాలు తీసుకొచ్చారని అన్నారు.

07/18/2016 - 00:23

బాలసముద్రం, జూలై 17: కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో నాటిన మొక్కలను పరిరక్షించుకోవాలసిన బాధ్యత పోలీసు అధికారులపై ఉందని వరంగల్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు సూచించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా పోలీసు కమిషనర్ ఆద్వర్యంలో పోలీస్ అధికారులు జెఎన్‌ఎస్ గ్రౌండ్ నందు ఆదివారం మొక్కలను నాటారు.

07/18/2016 - 00:23

వరంగల్, జూలై 17: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహార కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోంది. ముఖ్యమంత్రి కెసిఆర్ మొక్కలు నాటే కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, పోలీసు అధికారులు, ప్రభుత్వాధికారులు పోటాపోటీగా హరితహారం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాగా ప్రజల నుండి కూడా విశేష స్పందన లభిస్తోంది.

07/18/2016 - 00:22

శాయంపేట, జూలై 17: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరతహార కార్యక్రమం బహృత్తరమైన కార్యక్రమమని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఆదివారం శాయంపేటలో రూ. 13 లక్షలతో గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి, ఇజిఎస్ రూ. 40 లక్షలతో వ్యవసాయ గోదాం నిర్మాణానికి, అసంతృప్తిగా నిలిచిన ఐకెపి భవన నిర్మాణానికి అదనపు నిధులు రూ. 11 లక్షలతో నిర్మాణాలకు స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి శంకుస్థాపన చేశారు.

07/18/2016 - 00:21

జనగామ టౌన్, జూలై 17: విద్యార్థుల్లో క్రమశిక్షణను పెంపొందించి వారిని ఉన్నత స్థాయిలోకి పంపించడానికి ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల రాష్ట్ర కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆదివారం జనగామ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరయ్యారు.

Pages