S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/18/2016 - 01:50

సుండుపల్లె, జూలై 17: మండలంలోని మాచిరెడ్డిగారిపల్లె పంచాయతీలోని ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు, రైతులకు ఆదివారం ఉచితంగా అదే గ్రామానికి చెందిన ఎంపీటీసీ మహేశ్వర్‌రెడ్డి చేతుల మీదుగా గడ్డపారలు పంపిణీ చేశారు. గ్రామంలోని 270 మంది రైతులకు పంపిణీ చేసినట్లు తెలిపారు.

07/18/2016 - 01:49

కొండాపురం, జూలై 17: పంట రుణాల కోసం బ్యాంకులకు వెళ్లే రైతులకు పాసుపుస్తకాల కష్టం తప్పినట్లే. పట్టాదారు పాసుపుస్తకంతోపాటు టైటిల్‌లీడ్ ఉంటేనే పంట రుణం ఇస్తామని తిప్పుకొనే పరిస్థితి లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకనుగుణంగానే త్వరలోనే చట్ట సవరణ చేయబోతున్నారు. ఒక భూమికి ఒకే రికార్డ్, పాసుపుస్తకమని, టైటిల్ లీడ్ అని ఇలా రకరకాల గందరగోళాలు ఇకపై ఉండవు.

07/18/2016 - 01:49

కడప,(కల్చరల్)జూలై 17: స్వస్తిశ్రీ ధుర్ముఖినామ సంవత్సరం ఆషాఢ శుద్ధిపూర్ణిమ (ఆషాఢవ్యాస పౌర్ణమి) పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఈనెల 19వ తేదీ మంగళవారం భక్తులందరూ శ్రీ సద్గురు సాయినాధునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించనున్నారు. త్రిమూర్తుల స్వరూపంగా గురువును భావించి ఆరాధించడం హైందవజాతి లక్షణం. అజ్ఞాన అంధకారంలో మునిగితేలే శిష్యకోటిని ఉద్దరించేవాడు గురువు.

07/18/2016 - 01:48

కడప,జూలై 17: జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకోసం మెరుగైన వైద్యసేవలందించాలన్న ఉద్దేశ్యంతో గత ప్రభుత్వం జిల్లాలోని చెన్నూరు, మైదుకూరు, పోరుమామిళ్ల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, వేంపల్లె, కమలాపురం, లక్కిరెడ్డిపల్లె, రాయచోటి , సిద్దవటం, బద్వేలు, రైల్వేకోడూరు, రాజంపేట క్లస్టర్ కేంద్రాలుగా మార్చి మెరుగైన వైద్యసేవలు అందించాలన్న ఉద్దేశ్యంతో క్లస్టర్ అధికారులు డిప్యూటీ డిఎంహెచ్‌ఓలను, సీన

07/18/2016 - 01:46

అనంతపురం, జూలై 17 : జిల్లా నుంచి విజయవాడకు వెళ్లేందుకు రైల్వే శాఖ నూతన సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభించినప్పటికీ.. ఆ ఆనందం సాధారణ ప్రయాణికులకు దక్కే పరిస్థితి లేకుండా పోయింది. జిల్లా నుంచి విజయవాడకు వేగంగా వెళ్లవచ్చని, ప్రయాణ కష్టాలు కొంతైనా తగ్గుతాయని భావించిన వారికి ఆశాభంగం తప్పడం లేదు.

07/18/2016 - 01:45

అనంతపురం, జూలై 17 : జిల్లాలో నిరుద్యోగ సమస్య అనకొండలా పెరిగిపోతోంది. అనేకమంది నిరుద్యోగులు వయో పరిమితి మించిపోతున్నా ఉద్యోగానే్వషణలో అలుపెరుగక పోరాటం చేస్తున్నారు. జిల్లా ఎంప్లాయ్‌మెంట్ ఎక్చేంజ్‌లో ఇప్పటి వరకు నమోదైన గణాంకాల మేరకు పదో తరగతి (మెట్రిక్యులేషన్) నుంచి డిగ్రీ వరకూ, డిప్లొమో, ఐటిఐ తదితర కోర్సులు చేసిన సుమారు 53 వేల మంది నిరుద్యోగులున్నారు.

07/18/2016 - 01:44

అనంతపురం, జూలై 17 : రాష్టస్థ్రాయి పంద్రాగస్టు వేడుకలు అనంతలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో కలెక్టర్, జిల్లా ఉన్నతాధికారులతోపాటు పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. నెల క్రితం ఉగ్రవాదుల మకాం వార్తల నేపథ్యంలో జిల్లా అధికారులు అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈమేరకు అనంతపురంలోని పిటిసిలో ఏర్పాట్లు చేసేందుకు జిల్లాస్థాయి అధికారులను కలెక్టర్ సమాయత్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

07/18/2016 - 01:44

ఉరవకొండ, జూలై 17 : నియోజకవర్గ పరిధిలోని ఉరవకొండ, వజ్రకరూరు మండలాల్లోని వివిధ గ్రామాల్లో 10 రోజుల నుంచి అతిసార విజృంభిస్తోంది. రెండు వారాలుగా ఉరవకొండ మండలంలోని మోపిడి, రాకెట్ల, ఆమిద్యాల, నెరమెట్ల, ఉరవకొండ, వజ్రకరూరు మండలంలోని వెంకటాంపల్లి పెద్దతండా గ్రామాల్లో పలువురికి వాంతులు, విరేచనాలు అధికమై ఉరవకొండ, అనంతపురం, గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

07/18/2016 - 01:43

కణేకల్లు, జూలై 17 : జిల్లాలోని మారుమూల ప్రాంతం, కర్ణాటక సరిహద్దులో ఉన్న కణేకల్లు మేజర్ గ్రామ పంచాయతీకు చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు క్రీడల్లో అత్యున్నత ప్రతిభ కనబరుస్తుండడంతో అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. మండల స్థాయి నుంచి నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగి పేరుప్రఖ్యాతలు తెస్తున్నారు.

07/18/2016 - 01:43

పామిడి, జూలై 17: శ్రీ విఠోబా స్వాములవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం హనుమాన్ వాహన సేవలో శ్రీ పాండురంగస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ రంగ సుభేఫిర్కా భగవాన్‌దాస్ దేవాలయంలో ప్రత్యేక పూజలను చేపట్టిన అనంతరం శ్రీ పాండురంగ స్వామిని హనుమాన్ వాహనంలో పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామిని దర్శించుకున్నారు.

Pages