S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/29/2016 - 21:08

బాలీవుడ్ నటి బిపాసాబసుకు పెళ్లికళ వచ్చేసింది. బెంగాలీ సంప్రదాయశైలిలో వివాహం చేసుకుంటున్న ఆమె శుక్రవారంనాడు జరిగిన మెహిందీ వేడుకలో కళకళలాడింది. బాలీవుడ్ నటుడు కరణ్‌సింగ్‌గ్రోవర్, బిపాసాబసుల వివాహం శనివారంనాడు ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు శిల్పాశెట్టి, సోఫాచౌదరిసహా పలువురు బాలీవుడ్ తారలు హాజరయ్యారు.

04/29/2016 - 21:06

ఆర్.కె.స్టూడియోస్ పతాకంపై కృష్ణ కిశోర్ దర్శకత్వంలో రేవంత్, నోయల్ ప్రధాన తారాగణంగా రూపొందిస్తున్న చిత్రం ‘రాజా.. మీరు కేక’ (వర్కింగ్ టైటిల్) సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం సంస్థ కార్యాలయంలో లాంఛనంగా మొదలైంది. హీరోపై కె.రాఘవేంద్రరావు క్లాప్ ఇవ్వగా సినిమాను ప్రారంభించారు.

04/29/2016 - 21:03

పూరి జగన్నాథ్-మహేష్‌బాబుల కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘పోకిరి’ సినిమా విడుదలై పదేళ్లు అయిన సందర్భంగా వారిద్దరి కలయికలో రూపొందనున్న మరో చిత్రానికి సంబంధించిన ప్రకటన వెలువడింది. తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించి 40 కోట్ల మార్క్‌ను దాటిన ‘పోకిరి’ చిత్రం కన్నా ఈ సినిమా మరింత విజయవంతం అవుతుందని దర్శక నిర్మాతలు తెలిపారు.

04/29/2016 - 21:01

కంగనా రనౌత్ అంటే ఫైర్ బ్రాండ్‌గానే గుర్తొస్తుంది. ఇప్పటికే అనేకసార్లు ఉత్తమ నటిగా అవార్డులు కూడా కొట్టేసి అటు నటనతోపాటు ఇటు గ్లామర్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. కంగన ఎక్కడుంటే అక్కడ సంచలనాలే రేగుతున్నాయి. వాటితోపాటుగా గతంలో ఆమె బాయ్‌ఫ్రెండ్ అధ్యయన్ సుమన్ మరో సంచలనాలను ప్రకటించాడు.

04/29/2016 - 20:59

సాయిధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ రూపొందిస్తున్న చిత్రం ‘సుప్రీమ్’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు/ఎ సర్ట్ఫికెట్ లభించిన ఈ చిత్రాన్ని మే 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

04/29/2016 - 20:57

శుక్రవారం విడుదలైన బ్రహ్మోత్సవం కొత్త స్టిల్

04/29/2016 - 20:55

శరత్ కల్యాణ్‌బాబు కథానాయకుడిగా కవి ఫిలిం సిటీ పతాకంపై బండారు దానయ్య కవి స్వీయ దర్శకత్వంలో ప్రారంభమైన చిత్రం ‘డాటర్ ఆఫ్ బుచ్చిరెడ్డి’. ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్తపు సన్నివేశానికి శ్రీనివాస్ గౌడ్ క్లాప్‌నివ్వగా, ఆవుల బుచ్చిరెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. కిశోర్ గౌడ్ గౌరవ దర్శకత్వం వహించారు.

04/29/2016 - 20:54

తెలుగు, తమిళ చిత్రాల్లో కథానాయికగా సుస్థిర స్థానం ఏర్పరచుకున్న నయనతార, అటు సీనియర్, ఇటు జూనియర్ హీరోలతో కలిసి నటించింది. దక్షిణాదిలో నెం.1 కథానాయికగా గుర్తింపు పొందింది. ప్రేమాయణాలు నడపడంలో కూడా నెం.1గా నిలిచింది. ఓవైపు శింబుతో, మరోవైపు ప్రభుదేవాతో ప్రేమాయణాలు సాగించి ఎప్పుడూ సంచలన తారగానే వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం తెలుగులో ‘బాబు బంగారం’ చిత్రంలో నటిస్తోంది.

04/29/2016 - 18:17

చెన్నై: కాంచీపురంలో శంకరమఠం ఆడిటర్ రాధాకృష్ణన్‌పై దాడికి సంబంధించిన కేసులో కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతితో పాటు మరో ఎనిమిది మందిని నిర్దోషులుగా పేర్కొంటూ చెన్నైలోని సెషన్స్ కోర్టు శుక్రవారం తీర్పును ప్రకటించింది. 2002 సెప్టెంబర్ 20న ఆడిటర్ రాధాకృష్ణన్, ఆయన భార్య జయశ్రీ, సహాయకుడు కృష్ణన్‌పై ఆగంతకులు దాడి చేశారు.

04/29/2016 - 18:16

హైదరాబాద్: పాతబస్తీలోని ఓ ప్రసూతి ఆస్పత్రిలో వైద్యురాలిపై శుక్రవారం కొందరు మహిళలు దాడి చేశారు. పిల్లలకు టీకాలు ఇప్పించేందుకు వచ్చిన మహిళల పట్ల ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో ఆగ్రహించిన మహిళలు వారితో వాగ్వివాదానికి దిగారు. ఈ క్రమంలో ఓ వైద్యురాలిపై కొందరు మహిళలు చేసుకున్నారు. సిబ్బంది ఫిర్యాదుపై పోలీసులు ఆస్పత్రికి చేరుకుని నిందితులను అరెస్టు చేశారు.

Pages