S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/29/2016 - 12:44

లండన్: తనను అప్రతిష్టపాలు చేసేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, తనను అరెస్టు చేసి స్వదేశానికి తీసుకువెళ్లినా తన నుంచి డబ్బులు మాత్రం రాబట్టలేరని లండన్‌లో ఉంటున్న కింగ్‌ఫిషర్ యజమాని విజయ్ మాల్యా ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. మాల్యాను తమకు అప్పగించాలని లండన్‌లోని భారత రాయబారి కార్యాలయం ద్వారా బ్రిటన్ సర్కారుకు కేంద్రం విజ్ఞప్తి చేసింది.

04/29/2016 - 12:43

దిల్లీ: అగస్టా-వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై బిజెపి ఎంపి సుబ్రహ్మణ్య స్వామి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు శుక్రవారం ఆందోళనకు దిగారు. ఇక్కడి స్వామి ఇంటిముందు కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేసి హడావుడి సృష్టించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను అరెస్టు చేశారు.

04/29/2016 - 12:43

వరంగల్: రెండేళ్ల కుమార్తెతో పాటు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. పరకాల మండలం కంఠాత్మకూర్‌లో శుక్రవారం ఉదయం ఈ విషాద సంఘటన వెలుగు చూసింది.

04/29/2016 - 12:42

ఖమ్మం: పాలేరు ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి టిడిపి మద్దతు ప్రకటించడం దివాలాకోరు రాజకీయాలకు నిదర్శనమని మంత్రి కెటిఆర్ అన్నారు. నారాయణ్‌ఖేడ్‌లో కనిపించని సానుభూతి పాలేరులోనే టిడిపి నేతలకు కనిపించిందా? అని ఆయన ప్రశ్నించారు. విపక్షాలు ఎన్ని రాజకీయాలు చేసినా, పాలేరులో తమ అభ్యర్థి తుమ్మల గెలుపు ఖాయమన్నారు.

04/29/2016 - 12:42

దిల్లీ: ఎపి ప్రభుత్వం తగిన వసతి సౌకర్యాలు కల్పించనందునే హైకోర్టు ఏర్పాటులో అనివార్యమైన జాప్యం జరుగుతోందని కేంద్ర న్యాయశాఖామంత్రి సదానంద గౌడ శుక్రవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో తెలిపారు. అన్ని వసతులూ సమకూరిస్తే ఉమ్మడి హైకోర్టును విభజించడం సులువవుతుందన్నారు.

04/29/2016 - 12:42

విజయనగరం: అనుమానం పెనుభూతమై వెంటాడగా తాళికట్టిన భార్యను భర్త హతమార్చాడు. ఎల్.కోట మండలం రెల్లిగైరమ్మపేటలో శుక్రవారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది. వెంకటరమణ అనే వ్యక్తి అనుమానంతో భార్య అప్పలకొండను హత్య చేసినట్లు గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.

04/29/2016 - 08:26

సీతంపేట, ఏప్రిల్ 28: సీతంపేట ఏజెన్సీలో చిన్నబగ్గ గ్రామ సమీపంలోని ఏనుగులు సంచరిస్తున్నాయి. గ్రామానికి అతి సమీపంలో గురువారం అర్ధరాత్రి సమయంలో ఏనుగులు ఘీంకారాలు చేయడంతో ఆరుబయట నిద్రిస్తున్న గిరిజనులు దాబాలుపైకి వెళ్లిపోయారు. ఏనుగులు ఘీంకారాలు రాత్రంతా కంటిమీదు కనుకులేకుండా జాగారం చేశామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు.

04/29/2016 - 08:25

పాలకొండ(టౌన్), ఏప్రిల్ 28: చట్టబద్దంగా తక్కువ కాలంలో కేసులు పరిష్కారం మొబైల్ లోక్‌అదాలత్ ద్వారా సాధ్యమని జిల్లా లోక్‌అదాలత్ చైర్మన్ వి.బి నిర్మలగీతాంబ పేర్కొన్నారు. గురువారం ఆమె ఆర్డీవో కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడారు. కొన్నిసార్లు న్యాయకోసం పోరాటం చేసే వారికి దశాబ్దాలు తరబడి సమయం వృధా అవుతుందన్నారు. తద్వారా న్యాయం జరిగినప్పటికీ బాధితుడు కుటుంబీకులు న్యాయఫలాన్ని పొందుతున్నారన్నారు.

04/29/2016 - 08:25

ఎచ్చెర్ల, ఏప్రిల్ 28: ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్న కారణంగా స్థానికులు వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని 108 సిబ్బంది అవగాహన సదస్సులను మండలంలో నిర్వహించారు. గురువారం ఎస్‌ఎం పురం, కేశవరావుపేట, ఫరీదుపేట గ్రామాల్లో స్థానికులకు వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన అంశాలపై వివరించారు. ముఖ్యంగా 20 నుండి 40 ఏళ్లలోపు వయస్సు కలిగిన వారు ఎండల కారణంగా వడదెబ్బకు గురవుతున్నారన్నారు.

04/29/2016 - 08:24

శ్రీకాకుళం: రాజకీయాల్లో నేతలు కుల సమీకరణాలకే పెద్దపీట వేస్తున్నారు. అన్ని వర్గాలు మాకు సమానమేనన్న బీరాలు పలికే అధిష్ఠానాలు కూడా ఈ రొచ్చులో కూరుకుపోవడం తాజా రాజకీయాల్లో సాధారణమైపోయింది. శ్రీకాకుళం పట్టణంలోని కళింగ కోమట్లు తమది రాజకీయ వాపుకాదని, బలుపేనంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేకే సవాల్‌గా నిలవడం తాజా సంచలనమని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Pages