ఆత్మవిమర్శ అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజూ షూటింగ్‌ల్లో పాల్గొంటూనే ఉంటాం. ఒక్కొక్కసారి కొన్ని విషయాలు మర్చిపోతాం. ఏ తప్పు ఎప్పుడు చేశామో గుర్తుండకపోవచ్చు. అందుకే మనల్ని మనం నిరంతరం చెక్ చేసుకుంటుంటే ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వవంటోంది అందాలరాశి శృతిహాసన్. నన్ను నేను ఎప్పుడూ విమర్శించుకుంటూనే ఉంటాను. నాలోని లోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్దుకుని ప్రయత్నం చేస్తూనే ఉంటాను. నేను చేసిన తప్పేంటో ఇతరులు చెప్పకముందే గుర్తించేసి సర్దుకుంటాను. నటనలో మన వ్యక్తిత్వంలో ఎప్పటికప్పుడు స్పష్టమైన అభిప్రాయాలు లేకపోతే ఇబ్బందులు తప్పవు అని సుద్దులు చెబుతోంది ఈ సుందరి. కెరీర్ కంటే మన వ్యక్తిత్వమే ముఖ్యమని, ఎప్పటికప్పుడు కెరీర్‌ను నిత్యనూతనంగా రూపొందించుకోవాలంటే మన పర్సనాలిటీ దానికి వెన్నుదన్నుగా నిలుస్తుందని చెప్పుకొచ్చింది. ఇటీవలికాలంలో ప్రతి చిత్రంలో అంగాంగ ప్రదర్శన చేస్తున్నారు కదా! మరి అప్పుడు విమర్శించుకోడంలేదా అని అడిగితే, ఇలాంటివి ఎదుర్కోవాలని ముందే గుర్తించి దానికి తగ్గ సమాధానం కూడా చెప్పడానికే నన్ను నేను సిద్ధం చేసుకుంటానంటోంది. మొత్తానికి సినిమా పరిశ్రమలోకివచ్చాక శృతి ఆలోచనా ధోరణి శృతిమించిపోయింది.